ఇళ్ల పట్టాల పంపిణీ కి లైన్ క్లియర్!!!


     ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది, తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీ నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పింది. అదే సమయంలో తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని ఈసీని కోర్టు ఆదేశించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన పేదల ఇళ్ల పంపిణీ కి దాదాపు లైన్ అట్లే .ఇది పేదలకు శుభవార్త, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకో కూడదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎన్నికల కోడ్ ఎత్తేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కి మార్గం సుగమం అయింది.


     సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు, ఎన్నికల కోడ్ ఎత్తివేయడం సంతోషం అని అన్నారు. కోడ్ ఎత్తివేయడంతో పథకాలను యధావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపడతామని అన్నారు. కరోనా ను అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని అన్నారు. ఎన్నికల వాయిదా పడటం దురదృష్టకరమని షెడ్యూల్ ప్రకారం నిర్ణయించి ఉంటే, మరో పది రోజుల్లో ఎన్నికలు అయిపోయేవి అన్నారు. ఏపీలో  లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎన్నికలు వాయిదా వేశామని వాదించింది .


    ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసీ నిర్ణయమే ఫైనల్ అని, ఎన్నికల వాయిదా నిర్ణయం లో జోక్యం  చేసుకోలేమని అయితే  ఎన్నికల కోడ్ ఎత్తేసి, జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ తగిలింది, జోష్ మీద ఉన్న వైసీపీ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ముందుకు పోతుంది.సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉగాది రోజున 25లక్షల పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గం సుగమైంది.యథావిథిగా 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గం సుగమైంది.