ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్!!!


    తెలుగులో పాపులర్ హీరో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ,దర్శకత్వంలో ఆచార్య సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే  మ్యాట్ ని ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు, కలిసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నది. మెగాస్టార్ చిరంజీవి ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న, ఈ సినిమా మొదటి మరియు సినిమా పేరు  రేపు ఉగాది నాడు ఎనౌన్స్ చేయబోతున్నట్లు గా టాలీవుడ్ లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇకపోతే నేడు మెగాస్టార్ తన అభిమానులు ఒక అద్భుతమైన న్యూస్ చెప్పి మంచి జోష్ నింపారు.


     వివరాలు చూస్తే కాసేపటి క్రితం ఒక ఒక వీడియో  బైట్ ని విడుదల చేసి , మెగాస్టార్ తెలుగు సంవత్సరాది సందర్భంగా రేపటినుండి  ఇకపై తన అభిమానులకు, ప్రేక్షకులకు,చేరువయ్యేలా సోషల్ మీడియా వేదికల్లో అకౌంట్లో ఓపెన్ చేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ విధంగా సోషల్ మీడియా  మాధ్యమాల ద్వారా, ఎప్పటికప్పుడు, తన వ్యక్తిగత మరియు సినిమా సంగతులను  తెలపడంతో పాటు తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడంలో ఈ మాధ్యమాలు మంచి వార్తలు గా ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.


    ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు అందరు కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఇప్పుడు టచ్లో ఉంటున్నారు.విడుదలైన మెగాస్టార్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందుబాటులోకి రానున్న విషయం బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు కూడా ప్రేక్షకులు కూడా విపరీతంగా సంబరాలు మొదలయ్యాయి. సోషల్ మాధ్యమాలలో, విపరీతమైన క్రేజ్, ఈ విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విధంగా ఫ్యాన్స్ కి  గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి .