కరోనా వైరస్ ఎదుర్కొంటున్న దేశాలలో భారతదేశం, చేసే యుద్ధం ఒక ఎత్తు అయితే భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ దేశ్ రాష్ట్రం చేస్తున్న యుద్ధం ఒక ఎత్తు. అహర్నిశలు పనిచేస్తున్న భారతదేశ ప్రధానమంత్రి మోడీ అదేవిధంగా మన రాష్ట్రంలో యువకుడైన ఉత్సాహంతో పని చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటున్నారు ఢిల్లీ నాయకులు. దేశంలో లో కరోనా పెరుగుతున్న తరుణంలో హైరానా మొదలైంది, దక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో, మరియు కర్ణాటకలో, తమిళనాడు, తెలంగాణ, రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్న కేసులు.
కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మటుకు వైరస్ సోకకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు మటుకు సీనియర్ రాజకీయ నేతలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పరిపాలనలో గ్రామ వాలంటీర్ల ల వ్యవస్థను తీసుకొచ్చిన జగన్ వాళ్ల చేత సర్వే చేయించి ఎక్కడికక్కడ వైరస్ను కట్ చేస్తున్నారు. ఈ ఆంధ్ర ప్రదేశ్ వాలంటీర్లు జగన్ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎక్కడికక్కడ విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తిస్తూ ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నారు. దీన్ని గమనించిన ఢిల్లీ పెద్దలు శభాష్ జగన్ అంటూ మెచ్చుకుంటున్నారు.
మన రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన, ధైర్యంగా ముందుకు పోతు, ప్రజల మన్ననలను పొందుతున్నాడు. బియ్యాన్ని పప్పుని ఫ్రీగా ఇస్తూ, గ్రామ వాలంటీర్ల ద్వారా 5వ తేదీ వైట్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పాడు. అంతేకాకుండా 13 జిల్లాలకు జిల్లాకు ఒక్కొక్క ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీకాకుళం - ఎంఎం నాయక్,విజయనగరం - వివేక్ యాదవ్,విశాఖ - కాటంనేని భాస్కర్,తూర్పు గోదావరి - రాజశేఖర్,పశ్చిమగోదావరి - ప్రవీణ్ కుమార్కృష్ణా - సిద్దార్థ్ జైన్,గుంటూరు - కాంతిలాల్ దండే,ప్రకాశం - ఉదయ లక్ష్మి,నెల్లూరు - బి.శ్రీధర్,కర్నూలు - పీయూష్ కుమార్,కడప - శశిభూషన్ కుమార్,అనంతపురం - భాస్కరరావు నాయుడు,చిత్తూరు - రాంగోపాల్.