ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పటికే నాలుగు వేలమందికిపైగా ప్రాణాలను తీసుకోగా.. లక్ష మందికిపైగా దీని బారినపడి చికిత్స పొందుతున్నారు. అయితే గత నెల మనదేశంలో కూడా ఈ కరోనా ఎంటర్ అయ్యింది. దీంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అలర్టయ్యాయి. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. కరోనా వచ్చినట్లు అనుమానాలు కలిగితే.. వారిని వెంటనే పరీక్షిస్తున్నారు. ఇలా కరోనా అనుమానితులను పరీక్షించేందుకు దేశ వ్యాప్తంగా 52 కరోనా టెస్టింగ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కేంద్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ఒక టెస్టింగ్ సెంటర్..ఏపీలో మూడు టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయి.
ఏపీలోని కరోనా టెస్టింగ్ సెంటర్ల వివరాలు
1. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి
2. ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్టణం
3. ప్రభుత్వ మెడికల్ కాలేజ్, అనంతపురం
తెలంగాణలో కరోనా సెంటర్ వివరాలు..
1. గాంధీ ఆస్పత్రి, సికింద్రాబాద్
బీహార్‌లో..
1. రాజేంద్ర మెమొరియల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, పాట్నా
అసోం..
1.గువాటీ మెడికల్ కాలేజ్, గువాహటీ
2.రీజినల్ మెడికల్ రీసర్చ్ సెంటర్, దిబ్రూగర్
అండమాన్ & నికోబార్
1. రీజినల్ మెడికల్ రీసర్చ్ సెంటర్, పోర్ట్ బ్లెయర్, అండమాన్ అండ్ నికోబార్..
చండీగర్..
1.పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ రీసర్చ్, చండీగర్
ఛత్తీస్‌గఢ్
1. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాయిపూర్, రాయిపూర్
ఢిల్లీ- ఎన్‌సీటీ
1. ఎయిమ్స్, ఢిల్లీ
2. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్, ఢిల్లీ
గుజరాత్
1. బీజే మెడికల్ కాలేజ్, అహ్మదాబాద్
2. ఎం.పీ షా ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జామ్ నగర్
హర్యానా
1. పీటీ.బీడీ శర్మా పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, రోహతక్,
2. బీపీఎస్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్,సోనిపట్