ఆంధ్రప్రదేశ్ పరిపాలన అమరావతి నుంచి విశాఖపట్టణానికి మారబోతుందా నిజమే పరిస్థితులు పరిస్థితులు అలా అని కనిపిస్తున్నాయి,ఏప్రిల్ ఆరవ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈనెల ఆంధ్ర ప్రదేశ్ అమరావతిలోని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే పూర్తి బడ్జెట్ పెట్టే దానికి అవకాశం లేదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అమరావతిలో ఆందోళనలో ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ కు కసరత్తు చేయడం లేదు.దీంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈనెల 30వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.నాలుగు రోజుల్లోనే సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. అనంతరం ఏప్రిల్ 6వ తేదీ సోమవారం నుండి విశాఖ వేదికగా పాలన ప్రారంభం కావడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ విశాఖ కేంద్రంగా మార్చి విశాఖను మరింత అభివృద్ధివైపు నడిపి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి సిటీగా దేశంలోనే ఒక మంచి రాజధానిగా తీసుకుపోవాలని జగన్ నిర్ణయం.
ఇప్పటికే కొంతమంది అమరావతి రైతులు ఈ విశాఖను కు మార్చడానికి లేదని ఆందోళన చేస్తున్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ బాగుండాలంటే వికేంద్రీకరణ వైపు అడుగులు వేయాలని చూస్తున్నారు. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో సీఎంలు వికేంద్రీకరణ వైపు అడుగులు వేస్తూ ముందుకు పోతున్నారు. దీనిని బట్టి మన రాష్ట్రాన్ని వికేంద్రీకరణ వైపు అడుగులు పడుతున్నాయి ,ఈ రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడపాలని జగన్ దృఢనిశ్చయంతో ఉన్నారు.