జలుబు, దగ్గు రాకుండా చూసుకోవాలి!!!


    ఇటువంటి సమయంలో జలుబు దగ్గు రాకుండా చూసుకోవాలి, ప్రపంచ దేశాలను  కల్లోలం సృష్టిస్తున్న కరోనా.  జలుబు వచ్చిందంటే ఎవరైనా భయపడే రోజులు ఇవి కాబట్టి ఇటువంటి సమయంలో అందరూ దయచేసి ఈ జలుబుని రాకుండా చూసుకో వలసిందిగా మనవి. ఎటువంటి ఫ్రిజ్ లో పెట్టిన పదార్ధాలు తీసుకోకూడదు, వీలైనంత ఎక్కువ సి విటమిన్ పదార్థాలు తినండి. రోజు  వేడినీళ్లు నాలుగైదు సార్లు పసుపు వేసుకొని తాగండి , ఉప్పు నీళ్లతో గోరువెచ్చని నీటిని పుక్కిలించండి .


    ఈ జలుబే కరోనా నాకు  మూలం కాబట్టి, జలుబు అనేది లేకుండా చూసుకోండి. డస్ట్ ఎలర్జీ ఉన్నవారు ఇంట్లో బూజు, దుమ్ము, కొట్టకుండా చూసుకోండి. శరీర ఉష్ణోగ్రత తగ్గించే ఆహార పదార్థాలు పక్కన పెట్టడం మంచిది. జలుబుకి మంచి రెసిపీ కావలసిన పదార్థాలను ఒక్కసారి చూద్దాం. ఆలివ్ ఆయిల్, తేనె ,తురిమిన బెల్లం, నిమ్మకాయ, తయారీ ముందుగా ఒక గిన్నె తీసుకోండి అందులో ఆలివ్ ఆయిల్, తేనె, బెల్లం, నిమ్మకాయ రసాన్ని, సమానంగా తీసుకోవాలి.


     వీటన్నిటిని బాగా కలిపి కొద్దికొద్దిగా రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. ఇలా రెండు మూడు రోజులు సరిగ్గా పాటిస్తే జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. అసలే రోజులు బాగాలేదు పరిస్థితులకు అనుగుణంగా క్రమశిక్షణతో మనకు మనం ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు సాగండి. మన ఫ్యామిలీ కోసం మనకోసం కరోనా నియమాలు  పాటిస్తూ, మరో సరికొత్త భావి భారతం నిర్మిద్దామ్.