నెల్లూరు(ఏపీ)మొట్టమొదటి కరోనా పాజిటివ్ యువకుడు డిశ్చార్జ్!


   ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదట కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు..ఇటలీలో ఎంఎస్ చదువుతున్న యువకుడు గత వారం నెల్లూరుకు వచ్చాడు.టెస్ట్‌లు చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆ యువకుడ్ని ఈ నెల 9న ప్రొఫెసర్ నరేంద్ర బృందం చికిత్స చేసింది. చికిత్స అనంతరం మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా తాజాగా నెగిటివ్ అని రావడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ యువకుడ్ని మరో 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచి మరోసారి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..


ఇటలీ లో పిట్టల్లా రాలి రోడ్లమీదే ప్రాణాలు వదిలిన ప్రజలు.


      ఆరు కోట్లమంది జనాభా ఉన్న దేశం లోని ప్రజలు ఇట్లా దిక్కుమొక్కూ లేని చావు చస్తుంటే ,మరి 130 కోట్లమంది జనాభా కలిగిన భారతదేశం లో ఈ మహమ్మారి విస్తృతంగా ప్రభలితే , ఇలా పిట్టల్లా రాలే వాళ్లలో మీరో , మీ కుటుంబసభ్యులో , మీ ఆత్మీయులో ఉంటే , కళ్ళ ముందే కుప్పకూలి పోయి ప్రాణాలు వదులుతుంటే, ఏమి చేయలేని పరిస్థితుల్లో అచేతనంగా ఆ మరణాన్ని చూస్తూ ఉంటే ఆ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి.. ఒక్కసారి ఆ మరణ వికృత తాండవాన్ని మీ కళ్ళముందు ఆవిష్కరించుకోండి.


జరిగే పరిణామాన్ని గ్రహించి ఇప్పుడన్నా జాగ్రత్త పడండి... 


మరణం మీ వాకిలిని తట్టినప్పుడు


ప్రభుత్వాన్నో ? మోదీ గారినో ? జగన్ గారినో ?  తిట్టుకొని ప్రయోజనం లేదు.


లాక్ డౌన్ ని ఖచ్చితంగా పాటిద్దాం , కరోనాని తరిమేద్దాం.