దేశంలో తీవ్రంగా కరోనా వైరస్ మారుతున్న నేపధ్యంలోకరోనా వైరస్ పై దేశం పోరాటం ప్రకటించి షట్ డౌన్ అయ్యింది,కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి కంట్రోల్ చెయ్యటం కోసం ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని షట్ డౌన్ చేశారు.. ఎవరూ ఇళ్ళ నుండి బయటకు రావద్దని చెప్పారు. మార్చి 31 వరకు ప్రభుత్వ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు. ఇక అంతే కాదు విదేశాల నుండి వచ్చిన వారిని శత్రువుల్లాగా చూడవద్దని అన్నారు. విదేశాల నుండి వచ్చిన వారు బాధ్యత తీసుకుని అధికారులకు ఎక్కడున్నారో సమాచారం ఇవ్వాలని, కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలనిపిలుపునిచ్చారు.
లాక్ డౌన్ సక్సెస్ చెయ్యటం కోసం ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం
లాక్ డౌన్ పాటిం చాలని ప్రాణాలను కాపాడుకోండి అని ప్రభుత్వం చెబుతున్నా, వినకుండా నిత్యావసరాల కోసం రోడ్డుపైకి వస్తున్నారు. కరోనా కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో, మరింత రిస్కు పెంచుతున్న వారి కోసం జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ తాజాగా జారీ చేసిన ఆదేశాలు అమలైతే నిత్యావసరాల కోసం ఎవరూ రోడ్డు మీదకు రానక్కరలేదు. ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు వారి వద్దకే చేర్చే ఆలోచన చేస్తుంది ఏపీ సర్కార్ .
ప్రజలు బయటకు వస్తూ సరుకుల కోసమో, కూరగాయల కోసమో అని సాకులు చెబుతున్నారు. అయితే వారిలో కొందరు నిజంగానే సరుకులు, కూరగాయలకు వస్తున్న క్రమంలో ప్రతీ కాలనీలోని కూరగాయలు, నిత్యావసర సరుకులను తోపుడు బళ్లపై విక్రయించేలా ఆదేశాలు జారీ చేసారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి . ఇక ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా తోపుడు బళ్లపై నిత్యావసరాలను విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పివి రమేష్ తెలిపారు.