నర్సు కి షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ!!!


    మహారాష్ట్రలోని పూణే చెందిన ఒక నర్సుకు, ఫోన్ చేసి  షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ. పుణేకు చెందిన ఒక  నర్సుకు కాల్ వచ్చింది, ఫోన్ ఎత్త గా అవతల వ్యక్తి సాక్షాత్తు భారతదేశ ప్రధాన మోడీ అని తెలిసి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. మోడీ అడిగిన ప్రశ్నలకు అంకితభావంతో సమాధానాలు ఇచ్చి, తన సేవకు కట్టుబడి సేవా నిరతిని చాటుకుంది. దేశ ప్రజల కోసం ప్రధాని చూపుతున్న శ్రద్ధను ఆమె ప్రశంసించింది. ప్రస్తుతం భారతదేశంలో మీడియాలో ఇది హాట్ టాపిక్ అయింది.


    పుణె మున్సిపాలిటీకి చెందిన నాయుడు ఆసుపత్రిలో ఛాయ జగ్‌తప్ నర్సుగా పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం ఆమెకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. కోవిడ్-19 చికిత్సల విషయంపై ఆసుపత్రి సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రధాని ఈ సందర్భంగా కొనియాడినట్టు పుణె మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఆరోగ్యాధికారి ఒకరు ధ్రువీకరించారు. జగ్‌తప్, మోదీ మధ్య జరిగిన ఆడియో సంభాషణ నర్సింగ్ సేవలందిస్తున్న వేలాది మందికి స్ఫూర్తిగానూ, తక్కిన సిబ్బందికి ప్రేరణగానూ నిలిచిందని చెప్పారు.


సంభాషణ ఇలా సాగింది


మోడీ; -రోగులకు అంకితభావంతో సేవలందించే విషయంలో తన గురించి, తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించలేదా అని అడిగిన్పపుడు.


జగ్‌తప్ నర్సు;-కుటుంబ ఆందోళనలు సహజమే. అయితే పని చేయడం విద్యుక్త ధర్మం. ఈ పరిస్థితుల్లో పేషెంట్లకు మేము సేవలందించాలి. తగిన జాగ్రత్తలు మాత్రం పాటిస్తున్నాం' అని ఆమె సమాధానమిచ్చింది.


మోడీ;- పేషెంట్ల భయాలను ఎలా తొలగిస్తున్నారని మోదీ మరో ప్రశ్న.


జగ్‌తప్ నర్సు;-వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. భయపడవద్దని చెబుతున్నాం. ఏమీ కాదని, వైద్యపరీక్షల్లో నెగిటివ్ వస్తుందని భరోసా కలిగిస్తున్నాం. పాజిటివ్ పేషెంట్లల్లో కూడా నైతిక స్థైర్యం పెంచేందుకు సిబ్బంది కృషి చేస్తోంది' అని జగ్‌తప్ మోదీకి తెలిపారు. కోవిడ్-19ఏడుగురుపేషెంట్లను పూర్తిగా స్వస్థత చేకూరిన తర్వాత డిశ్చార్చ్ చేసినట్టు కూడా ఆమె వివరించారు.


మోడీ;-వివిధ ఆసుపత్రుల్లో అవిశ్రాంతంగా సేవలందిస్తున్న లక్షలాది మంది వైద్య సిబ్బందికి ఏమైనా చెప్పదలచుకున్నారా అని మోదీ అడిగినప్పుడు.


జగ్‌తప్ నర్సు;-.'భయపడాల్సిన అవసరమే లేదు. మనం ఈ రోగాన్ని తరిమిగొట్టి తీరుతాం. మన దేశం విజేతగా నిలిచేలా చేస్తాం. ఇదే దేశంలోని అన్ని ఆసుపత్రులు, వైద్య సిబ్బంది లక్ష్యం కావాలి' అని జగ్‌తప్ సందేశం ఇచ్చింది


    జగ్‌తప్ అంకితభావానికి, ఆమె అందిస్తున్న సేవలకి మోదీ ప్రశంసలు కురిపించారుజగ్‌తప్ అంకితభావానికి, ఆమె అందిస్తున్న సేవలకి మోదీ ప్రశంసలు కురిపించారు. 'తపస్విలా లక్షలాది మంది నర్సులు, పారామెడికల్ సిబ్బంది, డాక్టర్లు దేశవ్యాప్తంగా రోగులకు సేవలందిస్తున్నారు. మీ అనుభవాలు తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది' అని మోదీ ప్రశంసించారు.. జగ్‌తప్ సైతం ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ, నర్సుగా తన వృత్తి మాత్రమే తాను చేస్తున్నామని, మీరు (ప్రధాని) దేశం కోసం ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తున్నారని, మీకు ప్రత్యేక కృతజ్ఞతని ఆమె పేర్కొన్నారు. 'మీ వంటి ప్రధాని దొరకడం దేశం చేసుకున్న అదృష్టం' అని కూడా ఆమె చివర్లో కొనియాడారు.