.తెలుగు చలన చిత్ర పరిశ్రమ దాతృత్వానికి జేజేలు పవన్ కళ్యాణ్‌!!!


     కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాలకి అండగా తాము ఉన్నామనే భరోసా ఇస్తున్నారు. టాలీవుడ్‌ సినీ ప్రముఖులు, సహాయ కార్యక్రమాలకి అండగా నిలబడుతూ ఆర్ధిక సాయాలు చేస్తున్నారు . ప్రభాస్‌ రూ.4 కోట్ల విరాళం అందించగా, పవన్‌ కళ్యాణ్‌ రూ. 2 కోట్లు, చిరంజీవి రూ.1 కోటీ, అల్లు అర్జున్ రూ. 1.25 కోట్లు,రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్ రూ. 75 లక్షల విరాళం అందించారు.తెలుగు చలన చిత్ర పరిశ్రమ దాతృత్వానికి పవన్‌ కళ్యాణ్‌ జేజేలు పలుకుతున్నారు.. ముఖ్యంగా పెద్దన్నయ్య పెద్ద మనస్సు గొప్పది. చిరంజీవి సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించినందుకు ఆయన తమ్ముడిగా గర్వపడుతున్నాను.


    నా అన్న బిడ్డ రామ్‌ చరణ్‌..తండ్రి అడుగుజాడలలో పయనిస్తూ తనకంటూ సేవాభావాన్ని పెంపొందించుకుంటూ యువతకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరో యువశక్తి తారక్‌ రూ. 70లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించడం ముదావహం అని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు పవన్‌. అలాగే విరాళం అందించేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరి పేరుని ప్రస్తావిస్తూ వారికి జేజేలు పలికారు పవన్ కళ్యాణ్‌.తెలుగు చలన చిత్ర పరిశ్రమ దాతృత్వానికి జేజేలు.


     సినిమా పరిశ్రమలోని 24 విభాగాలలోని ప్రతి టెక్నీషియన్‌, ప్రతీ కార్మికుని శ్రమ తెలిసిన వ్యక్తి శ్రీ చిరంజీవి. కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి సినిమానే నమ్ముకొని జీవిస్తున్న ఎందరో కార్మికులు, టెక్నీషియన్లు ఆర్ధికంగా అల్లాడిపోతున్నారు. అటువంటి వారిని ఆదుకోవడానికి పెద్దన్నగా ముందుకు వచ్చిన శ్రీ చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలని నిర్ణయించుకున్న ఆయన దయార్ధ్ర హృదయానికి జేజేలు పలుకుతున్నాను..నాలుగు కోట్ల రూపాయల భూరి విరాళాన్ని ప్రకటించి ప్రభాస్ తన పెద్ధ మనసు చాటుకున్నారు.. సమాజ క్షేమం గురించి ఆలోచించే మహేష్‌ బాబు కోటీ రూపాయలు ఇచ్చి సమాజం పట్ల తనకున్న ఆపేక్షను వ్యక్తం చేశారు...