ఏపీ ప్రజలకు శుభవార్త !!!


    ఏపీ ప్రజలకు శుభవార్త , ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి కరోనా కేసులో పూర్తిగా నెల్లూరు యువకుడు కోలుకున్నాడు. కాకినాడ లో కూడా కరోనా కారణంతో మహిళ చనిపోలేదు . ఆమె మొట్ట మొదట  కరోనా వచ్చిందని భావించారు కానీ  వైద్య పరీక్షలలో  కరోనా లేదని తేలింది. ఆమెకు మెదడువాపు బారినపడి మృతి చెందిందని ఆమెకు కరోనా రాలేదని వైద్యాధికారులు ప్రకటించారు. ఈనెల 11  దుబాయ్ నుంచి స్వగ్రామానికి రాగా ముందు జాగ్రత్తగా ఆమెకు ఆదివారం కాకినాడ జిజిహెచ్ లో ఐసోలేషన్ వార్డులో చికిత్స చేశారు.


     వైద్యులు ఆమె రక్తం శాంపిల్స్ను, తిరుపతిలోని సిమ్ ఆస్పత్రికి పంపించారు. సోమవారం  వేకువజామున ఆమె మృతి చెందింది. ఆమెకు కరోనా లేదని ల్యాబ్ రిపోర్ట్ లు వచ్చాయని, ఆమెకు మెదడు వాపు ఉన్నట్లు నిర్ధారణ అయిందని జిజిహెచ్ సూపరిండెంట్ డాక్టర్ ఎం రాఘవేంద్ర రావు చెప్పారు . ప్రపంచవ్యాప్తంగా కరోనా  వైరస్ సంచలనాలు సృష్టిస్తున్న అప్పటికీ భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తున్న ప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీని ప్రభావం పెద్దగా లేదు ఒక్క కేసు మాత్రమే నమోదు.


     నెల్లూరు జిల్లాలో ఆ యువకుడు క్షేమంగా ఉన్నప్పటికి వాళ్ళ మిగతా వాళ్ళందరికీ ఈ వ్యాధి లేదని రిపోర్ట్స్ వచ్చినాయి. కాబట్టి కాబట్టి ఏపీ ప్రజలందరికీ ఇది శుభవార్త. కానీ మనం కూడా ఈ వ్యాధి పట్ల అవగాహనతో , ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తగా ముందుకుఅడుగు వేద్దాం..రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 76 మంది కరోనా అనుమానితులకు సంబంధించిన ల్యాబ్‌ రిపోర్టులు అందాయని, వాటిలో 75 మందికి కరోనా లేదని తేలింది. ఇప్పటివరకు నెల్లూరులో మాత్రమే పాజిటివ్‌ కేసు నమోదైందని,ఆ యువకుడు కూడా పూర్తిగా కోలుకున్నాడని స్పష్టం చేసింది.