ఈ ఉగాది నుండి కరోనా పై విజయంతో నవయుగానికి నాంది పలకాలి


ప్రజలకు సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు


      శ్రీ శార్వరి నామ సంవత్సరాదిసందర్భంగా, గా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కూడా వానలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో, ప్రతి ఒక్క ఇల్లు కళకళలాడాలని ,మన సంస్కృతి, సంప్రదాయాలు, కలకలం కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
     తెలుగువారి సంవత్సరాది ఉగాది షడ్రుచుల ఉగాదితో  ప్రారంభమయ్యే  శార్వరిలో ఇంటింటా ఆయురారోగ్యాలు సిరి సంపదలు ఆనందాలు నిండాలని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరుణ పరిస్థితి దృష్ట్యా సామూహిక వేడుకలకు దూరంగా మీ కుటుంబంతో ఈ పండుగనుసంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని  కరోనా  వైరస్ కట్టడి చేయడానికి దాన్ని వ్యాప్తిని నిరోధించేందుకు కు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలంతా తమ ఇళ్లలోనే పరిమితం కావాలని,  కరోనా  మీద విజయం సాధించి నవయుగానికి బాటలు వేయటం లో ప్రతి ఒక్కరిలో బాధ్యతగా మెలగాలని, పూర్తి సహాయ, సహకారాలు, అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
    ముఖ్యంగా గా ప్రతి ఒక్కరూ బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలని, ఈ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలని, మనం పోరాడుతున్నదిఒక వైరస్ తో, అది అంటువ్యాధి, కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని, ఈ తెలుగు ప్రజలందరూ సామరస్యంగా ఉండాలని. కలిసికట్టుగా ఉండాలని, ఈ వైరస్ ఎదుర్కోవడంలో మీ వంతు సహాయ సహకారాలతో లు ఉండాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉగాది నాడు మనము అందరము కరోనా  వైరస్ కట్టడికి కట్టుబడి ఉన్నాము. ఈ పోరాటంలో విజయం చేకూర్చాలని తెలుగు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.                                                                                                                                                       
మీ జగన్