ఎంతో వేగంగా వ్యాప్తి చందుతున్న కరోనా.అరికట్టే వైజ్ఞానిక ప్రయోగాలూ అంతే త్వరితంగా జరుగుతున్నాయి.భారత్ ప్రయత్నాల్లో వెనకబడిపోయిందనే కామెంట్‌ను మోస్తూ వచ్చాం ఇన్నాళ్లూ. చెక్ పెట్టారు ఆ మాటకువైరాలజిస్ట్ మినల్ దఖావె భోశాలే పుణెలోని 'మైల్యాబ్ డిస్కవరీ' అనే డయాగ్నస్టిక్ కంపెనీలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చీఫ్‌గా పనిచేస్తున్న ఆమె కేవలం ఆరు వారాల్లోనే 'కరోనా' వ్యాధి నిర్ధారణ కిట్‌ను కనిపెట్టారు. దానిపేరు 'పాథో డిటెక్ట్'ఆరువారాలు రికార్డ్ టైమ్. ఆ ఘనత మినల్‌కే దక్కుతుంది' అన్నారు 'మైల్యాబ్ డిస్కవరీ' డైరెక్టర్ డాక్టర్ గౌతమ్ వాంఖడే. మన దగ్గర నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చేత ఆమోదం పొందిన మొట్టమొదటి కరోనా నిర్ధారణా పరీక్షా పరికరం ఇదే.
ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు ఆమె నిండు చూలాలు,కొన్ని సమస్యలు,ఆరోగ్యపరంగా ఆసుపత్రిలో చేరింది కూడా. అప్పుడే మైల్యాబ్స్ డిస్కవరీ కరోనా టెస్టింగ్ కిట్స్ ప్రాజెక్ట్‌ను మినల్‌కు అప్పగించింది.క్లిష్టపరిస్థితుల్లో తనకు చేతనైన దేశసేవ చేయడానికి ఇంతకు మించిన అవకాశం ఏం ఉంటుంది అని ఈ ప్రయోగాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంది మినల్. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే పదిమంది టీమ్‌తో టెస్టింగ్ కిట్ ప్రయోగం మొదలుపెట్టింది. కేవలం నెలా పదిహేనురోజుల్లో విజయం సాధించింది.
కిట్‌కు సంబంధించిన ఫార్ములాను మొన్న పద్దెనిమిదో తేదీన (మార్చి నెల) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి సమర్పించింది. ఆ తర్వాత రోజే అంటే మార్చి 19న పండంటి పాపాయికి జన్మనిచ్చింది మినల్. ప్రస్తుతం ఈ రెండు శుభసందర్భాలనూ ఆమె ఆస్వాదిస్తోంది. కిట్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వస్తున్నాం. అందుకే ప్రతి ఒక్కరినీ పరీక్షించే వీలు లేకపోయింది. మనం దిగుమతి చేసుకుంటున్న వ్యాధి నిర్ధారణా విదేశీ కిట్స్ ఒక్కోటి 4,500 రూపాయలు. పాథో డిటెక్ట్ కిట్ వెల పన్నెండు వందల రూపాయలు మాత్రమేవిదేశీ కిట్‌లో ఫలితం రావడానికి ఆరు నుంచి ఏడు గంటల సమయం పడితే ఈ స్వదేశీ కిట్‌తో కేవలం రెండున్నర గంటల్లోనే ఫలితం వస్తుంది. ఒక్కో కిట్‌తో వంద శాంపుల్స్‌ను పరీక్షించొచ్చు అని చెప్తున్నారు నిపుణులు.
150 'పాథో డిటెక్ట్' కిట్‌లను తయారు చేశారు. వీటిని పుణెతోపాటు ముంబై. ఢిల్లీ, గోవా, బెంగళూరు నగరాలకు పంపుతున్నారు. తర్వాత మరిన్నిటిని మిగిలిన నగరాలకు సరఫరా చేస్తారు.
మన దేశంలో కరోనా మీద తొలి గెలుపుగా భావించొచ్చు. ఈ యుద్ధంలో మహిళ మేధోశక్తి విజయం సాధించడం భారతీయులందరికీ గర్వకారణమే!