దటీజ్ రోజా.......!!!!


    తెలుగు సినిమాలులో, ఎదురులేని గ్లామర్ తారగా, ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రోజా. రాజకీయాల్లో ఎదురులేని  నాయకురాలిగా వెలుగొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, వైసిపి ఎమ్మెల్యేగా, చిత్తూరు జిల్లా నుంచి కొనసాగుతున్నారు. వైసిపి పార్టీలో అగ్ర రాజకీయ నాయకురాలిగా జగన్ కు కుడిభుజము గా తన సత్తా చాటుతున్నారు. బుల్లితెర నిర్వహిస్తున్న జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరిస్తూ తెలుగు రాష్ట్రాల మన్ననలు పొందుతున్నారు.


     అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ నుండి చిత్తూరు లో పోటీ చేసిన రోజా, పార్టీ అధికారంలోకి రావడంతో ఐరన్ లెగ్ అనే పేరును తొలగించుకున్నారు. రోజా ఏ పార్టీలో ఉంటే అధికారంలోకి రాదని కొంతమంది వ్యాఖ్యానించిన వారు, పరిస్థితులు మారాయి ఐరన్ లెగ్ అన్నవాళ్లే, గోల్డెన్ లెగ్ అనడం ఆమె విజయానికి నిదర్శనం. ఇక ప్రజలకు సేవ  చేయటంలోనూ ముందర ఉన్నారు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఇప్పుడు  విజ్రంభిస్తున్న తరుణంలో,  బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా తన వంతు కర్తవ్యం నిర్వహిస్తున్నారు.


     తన భర్త సెల్వమణి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా కు అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. పేద కళాకారుల ఆదుకోవాలని పిలుపునివ్వడంతో, చాలామంది హీరోలు ముందుకొచ్చి తన వంతు సాయం చేస్తున్నారు. రోజా కూడా పేద కళాకారుల నిమిత్తం100 బియ్యం బస్తాలను,  పంపిణీ చేశారు. తెలుగు రాష్ట్రాల పేద ప్రజలను ఆదుకునేందుకు తనవంతు సాయంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రముఖుల నుండి విరాళాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రజలకు కరోనా పై పలు రకాలైన సూచనలు పరిశుభ్రత గురించి సమస్యల గురించి సోషల్ మీడియా వేదికగా తన స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు రోజా..