జయహో భారత్


    మోడీ పిలుపునిచ్చిన భారత్ జనత కర్ఫ్యూ విజయవంతం. ప్రజలందరూ మతాలకు, ప్రాంతాలకు, అతీతంగా, ప్రతి ఒక్కరు తమకు తామే జనతా కర్ఫ్యూ పాల్గొని విజయవంతం చేశారు. దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చి భారతదేశ సత్తా చాటారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా కలిసి ఉంటామని ఐక్యమత్యమే మా బలమని చాటిచెప్పారు. ప్రపంచాన్నే తలకిందులు చేసిన కరోనా దెబ్బకు ప్రపంచమే విల విల లాడుతుంది. ఇది భారత్కు విస్తరించి 347 కేసులు నమోదయ్యాయి. ఈరోజు గుజరాత్ లో 1 మహారాష్ట్రలో 2 కరోనా మరణాలు సంభవించాయి.వ్యాధి నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాట్లు పడుతున్నాయి.


     అధికారులు సైతం కరోనా కట్టడికి కట్టుబడి ఉన్నారు. ఈ తరుణంలో ఈ వ్యాధి విస్తరించకుండా ఆపాలని ఉద్దేశంతో మన ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా గా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్దతు పలికారు. ఇది భారతదేశంలో ఘన విజయం అయింది. భారత దేశ ప్రజలందరూ ఎటువంటి విపత్తు వచ్చిన ధైర్యంగా  నిలబడగల మని చాటిచెప్పారు. ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చారు. కలిసి కలిసి కట్టుగా ఉన్నంతవరకు భారతదేశాన్ని ఎవరు ఏమీ చేయలేరని నిరూపించారు.


వైద్యులకు వందనం


సేవ చేస్తున్న నర్సులకు వందనం


క్రమశిక్షణ కోసం పాటుపడుతున్న పోలీసుకి వందనం


     డాక్టర్లు నర్సులకు విధి నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరికి సాయంత్రం ఐదు గంటలకు వరండాలోకి వచ్చి, హర్షధ్వానాలు పలక మణి చెప్పిన మోడీ మాటకు విలువనిస్తూ తెలుగు రాష్ట్రాల సీఎంలు, జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్ ,అధికారులతో ,హర్షధ్వానాల మధ్య చప్పట్లతో సేవ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గవర్నర్ తమిళ సై సైతం ఇందులో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సైతం గంట కొట్టిహర్షధ్వానాలు పలికారు. భారతదేశం మొత్తంఎవరికి తోచింది వారు చప్పట్లతో, డబ్బులతో, మారుమోగిపోయింది.సేవ చేస్తున్న ప్రతి వైద్యులకు నర్సులకు కు పోలీసులకు అధికారులకు జైహో భారత్ కృతజ్ఞతలు .