కరోనాకు షాక్ ఇచ్చేలా భారత్!!!


     భారత్ కరోనాకుషాక్ ఇచ్చేలా ఉందిపుడు. ప్రమాదం తప్పిందని పూర్తిగా చెప్పలేకపోయినా,కరోనా యూరోపియన్ దేశాలను ఊపేసినంతగా భారత్లో ఉండబోదని అంటున్నారు.భారతీయుల ను మనం మెచ్చుకోవాల్సింది.అనేక దేశాలు (అగ్రరాజ్యం అమెరికా ) కరోనా కాటుకు చిక్కి విలవిలలాడుతున్నాయి130 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్నాభారత్ ఏం చేయగలదు .కరోనా కూడా వేగంగాభారత్ వైపు అడుగులు వేసుకుంటూ జట్ స్పీడ్ లో వచ్చింది.భారతీయుల శారీరక ధర్మం, ఆచార వ్యవహారాలు. ఆహారపు అలవాట్లు. ఎటువంటి క్ర్లిష్టమైన సమస్యనైనా తట్టుకునే శారీరక, మానసిక తత్వం, ఇవన్నీ కలసి కరోనాని భారత్ లో గట్టిగానే ఎదుర్కొంటున్నాయని అంటున్నారు.


     సహజంగానే భారతీయలు గుండె నిర్భయం ఉన్నవారు ఇక్కడే అసలైన సమస్యమొదలయింది, కరోనా సోకి చాలా మంది వేగంగా రికవరీ కావడం వెనక కూడా భారతీయ శారీరక ధర్మమే ప్రధాన పాత్ర పోషిస్తోందిట. అందుకే మరణాల రేటు కూడా పాయింట్ జీరోగా ఇప్పటికైతే ఉంటున్నాయి.భారతీయులలో మంచి సుగుణం ఉంది. కష్టకాలంలో దేశమంతా ఒక్కటి కావడం. రాజకీయాలకు అతీతంగా మేమంతా ఒక్కటే అని స్పందించడం. ఇదే ఇపుడు శ్రీరామ రక్షగా ఉంటోందిట. మరో వైపు ఈ సమయంలో మోడీ లాంటి నాయకుడు దేశానికి ప్రధానిగా ఉండడంఒక అద్రుష్టంగా చెప్పుకోవాలి.


    భారత్ జనాలకుమోడీ ఫై ఉన్న అపారమైన విశ్వాసం వల్ల కూడా లాక్ డౌన్ అని చెప్పిన వెంటనే ఏ మాత్రం సందేహించకుండా దేశమంతా ఒక్కటిగా మద్దతు పలికింది. ఈ లాక్ డౌన్ నిర్ణయాన్ని కూడా దేశంలోని రాష్ట్రాలన్నీ కూడా గట్టిగానే అమలుచేస్తున్నాయి. మరో విషయం ఏంటంటే సరైన టైంలో లాక్ డౌన్ ప్రకటించడం కూడా కలసివచ్చిందిట.మన భారత్ సంస్కారం. నమస్కారం, మన ఆచారాలు, ఎదుటివారికి చాదస్తాలుగా కనిపించే పద్ధతులు ఇవన్నీ కూడా ఇపుడు అతి పెద్ద దేశాన్ని కరోనా వైరస్ కాటు నుంచి కాపాడుతున్నాయి.ప్రస్తుతానికి భారత్ కరోనాను బాగానే అదుపులో ఉంచిందని ప్రపంచ దేశాలు అంటున్నాయి.మన దేశ  కరోనాను పొలిమేరల నుంచి తరిమేసేంతవరకూ ప్రతీ భారతీయుడుప్రతిన పూనాలి ప్రపంచ దేశాలు విస్తుపోయోల.


    .