ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!!!


  అగ్రరాజ్యం, అమెరికా అధ్యక్షుడు,  ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అగ్రరాజ్యం అమెరికాలో  కరోనా వైరస్  విజృంభణ కొనసాగుతున్న వేళ,మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలోమహమ్మారి కట్టడికి కోసం  ఆంక్షల్ని ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలంతా అప్పటివరకు సామాజిక దూరం పాటించాల్సిందేనని సృష్టం చేశారు.


  . శ్వేతసౌధంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.మరికొన్ని వారాల్లో దేశంలో పరిస్థితులు యథాతథ స్థితికి ఉంటాయని ఇటీవల సందర్భంగా అభిప్రాయపడ్డ ట్రంప్‌.ఇప్పుడా మాటల్ని వెనక్కి తగ్గడం పరిస్థితి తీవ్రతను అద్దంపడుతుంది.ఈస్టర్ పర్వదినం నాటికి అంతా సర్దుకోవాలి అభిప్రాయపడ్డ ట్రంప్‌.పరిస్థితి లేదని పరిస్థితులు ఆ విధంగా సాగడం లేదని నిరాశ వ్యక్తం చేశారు.అమెరికాలో ఈకరోనా వ్యాధి అంతకంతకూ పెరుగుతున్న ఈ నేపథ్యంలో పదిహేను రోజులపాటు జన సంచారం పై ఆంక్షలు విధించారు.


      ఈ  ఆంక్షలు మరో నెలరోజులు కొనసాగించ వచ్చు నట్లు ప్రకటించారు.అమెరికాలో లక్షకుపైగా మరణాలు సంభవించవచ్చు ఆరోగ్యశాఖ నిపుణుడుఆంథోనీ ఫాసీ  ఆందోళన చేశారు.ఈ వైరస్ ఇప్పుడిప్పుడే తొలగిపోయేలా లేదని ఆందోళన వ్యక్తం చేశారు  మృత్యువాత పడే సంఖ్య లక్ష నుంచి రెండు లక్షల మధ్య ఉండొచ్చని అన్నారు.ఈ నేపథ్యంలో మరి కొన్ని కొన్ని రోజులపాటు  ఆంక్షల్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది అమెరికాలో ఇప్పటివరకు  1,42,226మందికి కరోనా వైరస్‌ సోకింది.  వీరిలో 2493 మంది మరణించారు మరో 4443 కోలుకున్నారు.