లాక్ డౌన్ నుండి మినహాయింపు ఉన్న సేవలు.‌...!


    రాష్ట్రంలో ఈనెల 31 వరకూ లాక్ డౌన్ నుండి మినహాయింపు ఉన్న సేవలు.‌‌,,పోలీస్,,వైద్య, ఆరోగ్యం,, పట్టణ స్థానిక సంస్థలు, అగ్నిమాపక,విద్యుత్, తాగునీరు, పురపాలక సేవలు, బ్యాంకులు,ఎటియంలు,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలవారికి మినహాయింపు ఉంది.అదేవిధంగా ఆహారం, సరుకులు,పాలు,బ్రైడ్,పండ్లు, కూరగాయలు, మాంసం,చేపల రవాణా, గిడ్డంగులు, ఆసుపత్రులు,మందుల దుకాణాలు, కళ్ళజోళ్ళ దుకాణాలు,ఔషధ తయారీ వాటి రవాణా కార్యకలాపాలకు మినహాయింపు టెలికాం, ఇంటర్నెట్ సేవలు,ఐటి సేవకులకు, మినహా యింపు.ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలను కనిష్ట సిబ్బందితో పని చేయాలి, విదేశాల నుండి తిరిగి వచ్చిన వారందరూ 14 రోజుల పాటు కఠినమైన గృహ నిర్భందంలో ఉండాలి..


    అదేవిధంగా నిత్యావసర వస్తువుల తయారీ యూనిట్లు,, వాటి సరఫరా దారులకు,కరోనా నియంత్రణ కార్యకలాపాల్లో పాల్గొనే ప్రవేట్ సంస్థలకు మినహాయింపు ఉంది..పెట్రోల్ పంపులు,ఎల్పీజి గ్యాస్,ఆయిల్ ఏజెన్సీల రవాణా, గిడ్డంగుల్లో కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చారు,.ప్రజలు ఆహారం, ఔషదాలు,వైద్య పరికరాలను ఈ కామర్స్ సైట్లు ద్వారా పొందే అవకాశం ఉంది‌..ఇంకా ఏమైనా తప్పనిసరిగా ఉత్పత్తి,తయారీ చేయాల్సిన సంస్థలు ఏవైనా మినహాయింపులు పొందాల్సి ఉంటే జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని.


     అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ ఈనెల 31 వరకూ రాష్ట్రంలో లాక్ డౌన్..కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం 1897 అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని అమలులోకి తెస్తూ జిఓఆర్టి నం 209 ద్వారా ఆదేశాలు జారీ చేసింది..ఈ ఆదేశాల ప్రకారం ఈనెల 31 వరకూ రాష్ట్ర మంతటా లాక్ డౌన్ ప్రకటించింది..ఈ ఆదేశాలు అమలు పర్యవేక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు,జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు,డిఎంఅండ్ హెచ్ఓలు,సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు,ఎంపిడిఓలకు కట్ట బెట్టిందిఎవరైనా ఈ నియంత్రణ చర్యలను ఉల్లంఘిస్తే ఐపిసి సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకునే అధికారం వారికి కల్పించింది..అంతర్-రాష్ట్ర రవాణా సేవలు సహా ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు..అన్ని అనవసర వాణిజ్య దుకాణాలు మూసివేయాలి..బహిరంగ ప్రదేశాలలో 10 మందికి పైగా గుమిగూడడం  నిషేధించడం జరిగింది..