జనసేన అధ్యక్షుడు సినిమా హీరో పవన్ కళ్యాణ్ మన అందరికీ తెలిసిందే, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో బద్రి సినిమాతో దర్శకుడిగా పూరి పరిచయమై మంచి హిట్ చిత్రంగా రూపొందింది. వీరిద్దరి కలయిక సూపర్ హిట్ అయింది. బద్రి తర్వాత పన్నెండేళ్లకు కెమెరామెన్ గంగతో రాంబాబు వచ్చింది, ఇప్పుడు మూడోసారి పవన్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా కలిసి పని చేయబోతున్నారు .రీ ఎంట్రీ లో వరుస సినిమాలు కమిట్ అవుతున్న పవన్ తాజాగా పూరి జగన్నాథ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా పాత్రలో నటిస్తున్నాడు, డాషింగ్ డైరెక్టర్ పూరి గతంలో మహేష్ బాబు తో జన గణ మన పేరుతో సినిమా ప్రకటించాడు పూరీ జగన్నాథ్. ఈ చిత్రాన్ని మహేష్ వాయిదా వేస్తూ వచ్చాడు, జనగణమన కథని పవన్ కళ్యాణ్ కి చెప్పాడు పూరి జగన్నాథ్. ఇందులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి, పవన్ ప్రస్తుతం 'వకీల్ సాబ్'తో తో బిజీగా ఉన్నాడు,దాని తర్వాత ఇప్పటికే పట్టాలెక్కిన క్రిష్ మూవీ లైన్ లో ఉంది.
తర్వాత హరీష్ శంకర్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్ సినిమా ఉంటుంది ఆ తర్వాతనే పవన్ పూరి సినిమా ఉండే ఛాన్స్ ఉంటుంది సో పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది పండగలాంటి వార్త, ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఇంకొక పక్క సినిమా లో కూడా బిజీ అయిపోయి ఫ్యాన్స్ కి పండగ వాతావరణం తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్. ఇందులోముఖ్యమంత్రి పాత్రలో పవర్‌స్టార్‌ని చూపించబోతున్నాడట డాషింగ్ డైరెక్టర్ పూరి.