తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు సేవ చేసిన ఓ మహిళ ఉదంతం సోషల్ మీడియాలో చూసిన సవాంగ్,వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. నేరాల ఛేదనలో బిజీగా ఉండే పోలీసులకు కూడా భావోద్వేగాలు ఉంటాయని నిరూపించారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. చిరు సాయంచేసిన మహిళ. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నిత్యం రోడ్లపైనే కాపలా కాస్తున్నాపోలీసులుకు తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన లోకమణి అనే పేద మహిళ పోలీసులను కరోనా విధుల్లో చూసి జాలి పడింది. వారికి మంచినీళ్లు అందించే దిక్కులేని పరిస్ధితుల్లో రెండు కూల్ డ్రింక్స్ బాటిల్స్ కొని మరీ వారికి అందించింది.
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సాధారణ ప్రజలు సైతం ఆమెకు సెల్యూట్ చేశారు. ఆమె సేవను అభినందించారు.తూర్పుగోదావరి జిల్లా తునిలో లోకమణి అనే మహిళ పోలీసులకు కూల్ డ్రింక్స్ అందించి వారి దాహం తీర్చిన విషయం డీజీపీ గౌతం సవాంగ్ కు చేరింది .మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయించి మరీ ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు. ఆమె చేసిన సేవకు సెల్యూట్ చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు..
సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న డీజీపీ, తాను పోలీసులకు చెప్పి వెతికి వివరాలు తెప్పించుకున్నానని, మీ అమ్మతనాన్ని చూసి చలించిపోయానని తన సంభాషణలో తెలిపారు. దీంతో ఏం మాట్లాడాలో తెలియక ఆ మహిళ కూడా రెండు చేతులు జోడించింది. ఈ మొత్తం వీడియో కాన్ఫరెన్స్ ను గమనించిన తోటి పోలీసు అధికారులు సైతం చప్పట్లతో డీజీపీని, మహిళను కూడా అభినందించారు.