కరోనా మహమ్మారి తో ప్రజల నానా ఇబ్బందులు పడుతుంటే అండగా దండుగ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రూరల్ నియోజకవర్గ ప్రజలకు కొండంత అండగా ఉంటున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ధైర్యంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ, ప్రజలకు చేయూత నిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈరోజు 30 వ డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
కరోనా వ్యాధికి సలహాలు ఇస్తూ, సామాజిక దూరం పాటించమని మైకు పట్టుకుని మరి కార్యకర్తగా కార్యకర్త లాగా సేవ చేస్తున్న శ్రీధర్ రెడ్డి. 30 వ డివిజన్ లోని ప్రజల యోగక్షేమాలు ప్రతి ఇంటికి వెళ్లి తెలుసుకొని,నిత్యావసరాలు పంపిణీ చేస్తూ. కూరగాయల కేంద్ర సంచార కేంద్రాలపై ప్రజలతో చర్చిస్తూ 30 డివిజన్ పరిధిలోని నాలుగు వేల ఇళ్లకు 16000 మాస్కులు పంపిణీ చేసిన శ్రీధర్ రెడ్డి .
లాక్ డౌన్ అమల్లోకొచ్చినప్పటి నుండి ప్రతీ రోజూ వివిధ ప్రాంతాలకు వెళ్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. నిత్యావసర వస్తువులతో పాటూ కూరగాయలను అందిస్తున్నారు.నియోజకవర్గ పరిధిలోని అనేక మంది నేతలు ముందుకొచ్చి శ్రీధర్ రెడ్డికి దన్నుగా నిలచారు. ఈ కార్యక్రమాలలో శ్రీధర్ రెడ్డి వెంట రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మూర్తి, ఆర్ డి ఓ, ఎమ్మార్వో, హెల్త్ ఆఫీసర్, పాల్గొన్నారు.