ప్రపంచం మెచ్చిన నాయకుడు మోడీ !


    భారత్ దేశ  ప్రధాని నరేంద్ర మోదీ కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు చాలా కృషి చేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.మోదీ నాయకత్వాన్ని విశ్వసిస్తు భారత్ దేశంలో ప్రతీ ఒక్కరు సురక్షితంగా ఉన్నారని,మోదీని పొగుడుతూ ట్వీట్ చేశారు.కరోనా నివారణకు నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రశంసిస్తున్నారు. భారతీయ ప్రజల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలతో పాటు కరోనా సాయం కింద ఇతర దేశాలకు సాయం అందిస్తున్నారు. అందుకే దేశ ప్రజలంతా తాము సురక్షితంగా ఉన్నామని, మోదీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారంటూ' పేర్కొన్నారు. 


    అమెరికాకు చెందిన ఒక పరిశోధన సంస్థ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సమర్థంగా ఎవరు పని చేస్తున్నారనే దానిపై జనవరి 1 నుంచి ఏప్రిల్‌14 మధ్య సర్వే నిర్వహించింది. సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మోర్కెల్‌, కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ ప్రధాని ఎమాన్యుయల్ మెక్రాన్‌, తదితరులు ఉన్నారు. సంస్థ పరిశోదకులు దాదాపు 447 ఇంటర్య్వూలతో పాటు వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది. జనవరి నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు నరేంద్ర మోదీ 50 పాయింట్లతో మిగతావాళ్ల కంటే ముందువరుసలో ఉంటూ స్థిరంగా ఉన్నారు. అయితే ఏప్రిల్ 13 తర్వాత ఏకంగా 75 పాయింట్లు సాధించిన మోదీ దేశంలో కరోనా కట్టికి సమర్థంగా పని చేస్తున్నారని సర్వేలో తేలింది.


     ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ డేటా రూపంలో ఉన్న సమాచారాన్ని బుధవారం తన ట్విటర్‌లో షేర్ చేశారు. మోదీ పనితీరు బాగుందని, అందరూ అతని నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని పేర్కొన్నారు. లాక్‌డౌన్ నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని, దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారంటూ దుయ్యబట్టిన ప్రతిపక్షాలు ఇప్పటికి ఆయన ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకొని మద్దతు ఇవ్వాలని అన్నారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చిన అమిత్ షా ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు. సర్వే మోదీకి అనుకూలంగా రావడం విపక్షాలకు చెంపపెట్టు లాంటిదని అమిత్ షా పేర్కొన్నారు.