డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్


    డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా  క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.పాల్గొన్న మంత్రులు ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్. రాజ్యంగాన్ని రచించి దేశాన్ని అభ్యున్నతివైపు నడిపించిన గొప్ప మహనీయుడు అంబేడ్కర్‌ అని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.


 డాక్టర్ అంబేత్కర్ జయంతి సందర్భగా చిత్ర పటానికి నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్



    ఈ భారత్  దేశాన్ని  నడిపించిన గొప్ప మహనీయుడు అంబేడ్కర్‌,అంబేడ్కర్అడుగు జాడల్లో అందరు నడవాలని ఆయన సూచించారు.


 అంబేద్కర్ 129వ జయంతి  సందర్భంగాచిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు



    పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘ సంస్కర్త సామాజిక అసమానతలు రూపుమాపడంలో కృషి సల్పిన ఆదర్శప్రాయుడు అని,  ఆయన అడుగు జాడల్లో అందరం కలిసికట్టుగా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం బి శేషగిరిబాబు అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక నూతన జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డి.ఈ. ఓ.సి కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడు, సృష్టికర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు అని కలిసికట్టు గా ముందుకు నడిచి దేశాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్-2 శ్రీమతి కమలకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జున రావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు జీవ పుత్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.