చంద్రబాబు ప్రశ్న వైసీపీ పార్టీ జవాబు !


చంద్రబాబు;- జమాత్‌ తబ్లిగీల వల్లే కరోనా వ్యాపించింది అని ప్రధానికి జగన్‌ ఫిర్యాదు చేశాడు? 


సమాధానం ;- దిల్లీ ఆధ్యాత్మిక సమావేశంలో జరిగిన దాన్ని ఒక మతానికి, కులానికి ఆపాదించొద్దని, ఇది దురదృష్టకరమైన సంఘటన.అని ఏప్రిల్‌ 4 న CM జగన్‌ ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. 


చంద్రబాబు;- .ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దళిత ఉప ముఖ్యమంత్రి  (ఎక్సైజ్‌ శాఖ మంత్రి) నారాయణస్వామిని బర్తరఫ్‌ చేయాలి?


సమాధానం ;- ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని, ఎవరైనా బాధపడి ఉంటే మన్నించాలని మంత్రి నారాయణస్వామి బహిరంగానే క్షమాపణలు కోరాడు.నువ్వు అధికారంలో ఉన్నపుడు కనీసం ఒక్క ముస్లింకి కూడా మంత్రి పదవి ఇవ్వలేకపోయావు,జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ముస్లింను డిప్యూటీ చీఫ్‌ మినిష్టర్‌ చేశాడు. 


                                                                                                                                    చంద్రబాబు;-.రాష్ట్రానికి చెందిన వారు సరిహద్దుల్లో ఇబ్బందులు పడుతున్నారు? 


సమాధానం ;- లాక్‌డౌన్‌ వల్ల ఎక్కడివారు అక్కడ ఆగిపోయారు. తెలుగువాళ్లు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే గుజరాత్‌కు అధికారుల బృందం వెళ్లింది. తక్షణ అవసరాల కోసం  ప్రభుత్వం రూ.10 లక్షలు విడుదల చేసింది.కాశీలో ఇబ్బందులు పడుతుంటే, ప్రత్యేక బస్సు పెట్టి, థర్మల్‌ స్క్రీన్‌ చేసి ఎవరి ఇళ్లకు వాళ్లను పంపారు. 


చంద్రబాబు;- పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు? 


  సమాధానం ;- కరోనా విపత్తు వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ చాలా కష్టంగా మారింది. హార్టికల్చర్‌ రైతుల ఇబ్బందులు పడకూడదనే రాష్ట్రంలోనే అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు అరటి 450 ట్రక్కుల అరటిని దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపారు.మార్చి 30వ తేదీనే రొయ్యల ఎగుమతులు ప్రారంభం అయ్యాయి. 750 కంటెయినర్ల ఆక్వా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేశారు. 73 ప్రాసెసింగ్‌ యూనిట్లు నిరంతరం పని చేస్తున్నాయి.ధాన్యం కొనుగోలు మొదలుపెట్టిన రోజే రికార్డు స్థాయిలో 4,773 టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. 


 చంద్రబాబు;- .కరోనా మరణాలను ప్రభుత్వం దాస్తోంది? 


 సమాధానం ;- దాస్తే దాగే విషయమా, ఇది ఈ రోజు కాకుంటే మరో రోజు కచ్చితంగా బయటకు వస్తుంది.ఏరోజుకారోజు హెల్త్  బులెటిన్ ఇస్తున్నారు  చూసుకో.


(లాక్ డౌన్ సమయం లో AP ప్రభుత్వ పని తీరు దేశంలోనే అత్యుత్తమంముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం సమర్థ పనితీరు కనబరిచిందిఅందువల్లే ఏపీలో కరోనా తీవ్రత, మరణాల రేటు తక్కువగా ఉంది.జాతీయ మీడియా (ఇండియా  టుడే , టైమ్స్ , ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ హిందూ CNN NDTV ) జగన్ ప్రభుత్వాన్నిజాతి మీడియా పొగుడుతుంటే  (ఈనాడు, జ్యోతి ABN,  TV5,  Maha News,  NTV ) మాత్రం  బాబు పట్ల ఉన్న కులాభిమానం తో జగన్ మీద విషం చిమ్ముతున్నాయి .)