ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తన 70వ పుట్టిన రోజు జరుపుకుంటోన్న, సందర్భముగా పలువురు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు చెపుతున్నారు. ఏపీలో పార్టీ నాయకులు అందరు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెపుతున్నారు. ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి సైతం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా చెప్పారు. చంద్రబాబుకు దేవుడు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని తాను కోరుకుంటున్నానని, జగన్ పోస్ట్ చేశారు.
ఆయన తనయుడు లోకేష్ , మనవడు దేవాన్ష్ శుభాకాంక్షలు తెలిపారు.పగలనక, రాత్రనక ప్రజల బాగుకోసం అవిశ్రాంతంగా పని చేసిన వ్యక్తిని చూస్తూ పెరిగానని నారా లోకేష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు . ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత, అభిరుచి ఈ నాటికీ చెక్కుచెదరలేదని ఆయన అన్నారు. కోట్లాదిమంది తెలుగువారికి, తనకు,. దూరదృష్టి గల నాయకత్వంతో స్ఫూర్తినిస్తూనే ఉన్నారని చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ తన ట్వీట్‌లో లోకేశ్ పేర్కొన్నారు.
బ్రాహ్మణి ట్విట్టర్ అకౌంట్ నుంచి దేవాన్స్ (మనవడు) ముద్దు ముద్దు మాటలతోచంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు తాతా మీ ప్రేమను పొందడం గొప్ప విషయం. మీరు నాకు ఓ ఐకాన్, స్ఫూర్తి. అన్నిటికంటే మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేశాడు.దేవాన్ష్ చూపుతున్న తాతయ్య మీద ప్రేమకు టీడీపీ అభిమానులు,నెటిజన్లు, ఫిదా అవుతున్నారు.తెలుగుదేశం కార్యకర్తలు,నాయకులు,పెద్ద ఎత్త్తున శుభాకాంక్షలు చెప్పారు .స్ప్రెడ్ న్యూస్ పాఠకుల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు .ఇంకా అనేక పుట్టినరోజులు సంతోషముతో ,ఆనందముతో,జరుపుకోవాలని కోరుకొందాము.