భారత్‌కు గిఫ్ట్ ఇచ్చిన ట్రంప్!!!


    అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్ దేశ ప్రధాని నరెంద్రమోది ఫ్రెండ్స్ అన్న విషయము అందరికి తెలుసు ,కరోనా  వైరస్ నియంత్రణలో భాగంగా అమెరికా ప్రభుత్వం కోరిన వెంటనే భారత ప్రభుత్వం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను అమెరికాకు ఎగుమతి చేసిన విషయం గూడా తెలిసిందే.అమెరికా అధ్యక్షుడు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపినందుకు ట్రంప్ ధన్యవాదాలు కూడా తెలిపారు.భారత ప్రభుత్వం చేసిన సహాయానికి ట్రంప్ భారత్‌కు రిటర్న్ గిఫ్ట్ ప్రకటించారు. శత్రువుల నుంచి రక్షణకు అవసరమైన మిలిటరీ హార్డ్‌వేర్‌ను భారత్‌కు అమ్మనున్నట్టు ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్‌కు సమాచారమిచ్చారు.10 ఏజీఎం-84ఎల్ హార్పూన్ బ్లాక్ మిస్సైల్స్‌నుఅమెరికా ప్రభుత్వం భారత్‌కుఅమ్మేందుకు అంగీకరించింది. వీటితో పాటు 16 ఎమ్‌కే 54 లైట్ వెయిట్ టార్పెడోస్‌ను, మూడు ఎమ్‌కే 54 ఎక్ససైజ్ టార్పెడోస్‌లను భారత్‌కు అమ్మనుంది.


    హార్పూన్ మిస్సైల్స్, టార్పెడోస్ పీ-8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లో భాగమవుతాయని అమెరికా రక్షణ రంగం తెలిపింది. బోయింగ్ సంస్థ తయారుచేసిన పీ-8ఐ ఎయిర్‌క్రాఫ్ట్స్‌లో హార్పూన్ మిస్సైల్స్, లైట్ వెయిట్ టార్పెడోస్‌తో పాటు శత్రువుల జలంతర్గాములను కనిపెట్టి ధ్వంసం చేసే రక్షణ వ్యవస్థ కలిగి ఉంటుంది.ఇదివరకు కుదిరిన ఒప్పందం ప్రకారం  2022కి ఈ నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్స్ భారత రక్షణ రంగానికి చేరే అవకాశం ఉంది. ఇక గత నవంబర్‌లో 1.8 బిలియన్ డాలర్లతో మరో ఆరు పీ-8ఐ ఎయిర్‌క్రాఫ్ట్స్ కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్స్ కౌన్సిల్ ప్రతిపాదించింది.


    తమను తాము రక్షించుకోవడానికి శత్రువుల నుంచిఈ ఆయుధాలు భారత్‌కు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని కూడా బలపరచనుంది హైడ్రాక్సీక్లోరోక్విన్ రూపంలో భారత్ అమెరికాను ఆదుకోవడంతో, ఇప్పుడు భారత ప్రభుత్వ కోరికను అమెరికా తీర్చుతోంది.ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన సమయంలో మూడు బిలియన్ డాలర్లు విలువ చేసే 24 ఎమ్‌హెచ్-60 రోమియో మల్టీ రోల్ నావల్ హెలికాప్టర్స్, ఆరు అపాచి అటాక్ చాపర్స్‌ అమ్మేందుకు భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.