నిమ్మగడ్డకు షాక్!!!


    ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా నిర్మించాక సంచలనాలు చూశాం. గవర్నమెంట్ తో సంప్రదించకుండా ఎలక్షన్ల డేట్ క్యాన్సిల్ చేసిన రమేష్ కుమార్ దీన్ని కోర్టు కూడా తప్పుబట్టింది. తర్వాత  కేంద్రానికి ఒక లేఖ రాశారు ఈ లేఖని తానే రాశారని ఒకసారి రాయలేదని ఒకసారి చెప్పినట్లు మనం చూశాం. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి సిఐడి దర్యాప్తు నియమించింది. ఆలేఖ విషయంలో సీఐడీ దర్యాప్తు లో సంచలనాలు బయటకు వస్తున్నాయి.


    నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆర్ పిఎస్ సాంబమూర్తి అధికారుల ఎదుట అంగీకరించారు. ల్యాప్ టాప్‌లో ఆ లేక తయారు చేసి పెన్ డ్రైవ్ ద్వారా ఆ లేఖను డెస్క్ టాప్ లో వేసినట్లు సాంబమూర్తి  సిఐడి అధికారులకు తెలిపారు. ఆ లేఖను వాట్సాప్ ద్వారా రమేష్ కుమార్ పంపారు. ఆ లేఖను మొబైల్ నుండి రమేష్ కుమార్ కేంద్రానికి పంపినట్లు సమాచారం.  ల్యాప్ టాప్‌లో లో ఫైల్స్ డిలీట్  చేయడం తో పాటు పెన్ డ్రైవ్ ధ్వంసం చేశారని సిఐడి అధికారులు తెలిపారు. అనంతరండెస్క్ టాప్ కూడా  ఫార్మాట్ చేశారని చెప్పారు.


     లేఖకు సంబంధించి అన్ని ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారు  తెలియదన్నారు. వైఎస్ఆర్సిపి  విజయ సాయి రెడ్డి చెప్పినట్లు కూడా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆధారాలు ట్యాంపర్‌ చేసిన అంశంపై కేసు నమోదు చేశామని సిఐడి డీజీ  సునీల్ కుమార్ తెలిపారు. లేక నెంబర్ పైన కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. కేంద్రం రాసిన లేఖ 220 నెంబర్ తోనే అశోక్ బాబు రాసిన రెఫ్రెన్స్ లెటర్‌కు అదే నెంబర్ ఉందని, మొత్తం విషయాలన్నీ దర్యాప్తులో బయటకు వస్తాయని సిఐడి డీజీ సునీల్ కుమార్ తెలిపారు.