కరోనాను నియంత్రించేందుకుగొడుగు!


     దేశ ప్రధాని నుంచి సామాన్యుడి వరకూ ,కరోనాను నియంత్రించేందుకు సామాజిక దూరం పాటించాలన్న అవగాహన ఇప్పుడు వినిపిస్తోంది. సామాజిక దూరం  చేపట్టాల్సిన చర్యలపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.దేశంలోసామాజిక దూరం పాటించేందుకు మార్గాలను అన్వేషిస్తూ కొత్త మార్గాలను ప్రతిపాదిస్తున్నారు.విశాఖకు చెందిన ఓ డాక్టర్ ప్రతిపాదించిన సామాజిక దూర సిద్ధాంతం ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తోంది.సామాజిక దూరం పాటించేందుకు వివిద రాష్ట్రాల నుంచి సూచనలు, సలహాలు కోరుతున్న కేంద్రం.


    సామాజిక దూరం పాటించేందుకు ప్రజలు తమ చుట్టు పక్కల వారితో దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.ఒక్కోసారి మనం ఎంత దూరంగా ఉన్నా పక్కల ఉన్న వారు మనకు సమీపంగా వచ్చేస్తుంటారు. విశాఖకు చెందిన డాక్టర్ సూర్యారావు సూచిస్తున్నారు, దీనిని రూపు మాపాలంటే గొడుగు వాడాలని. మన వద్దకు రావాలంటే  గొడుగు పట్టుకుంటేపక్కనున్న వారు ఆలోచిస్తారని,  సామాజిక దూరం దానంతట అదే సాధ్యమవుతుందని ఆయన చెబుతున్నారు.



    సామాజిక దూరం పాటించేందుకు  సూచనలు, సలహాలు కోరుతున్నకేంద్రం. రాష్ట్రాల నుంచి, ప్రముఖులనుండి, ఔత్సాహికుల నుంచికోరుతుంది. ఎక్కువ మంది ఆచరించే అవకాశం ఉన్న వాటిని పరిశీలించి కరోనాకు వ్యతిరేకంగా చేపడుతున్న ప్రచారంలో వాడుకోవాలని భావిస్తోంది. దీంతో విశాఖ వైద్యుడు సూర్యారావు ప్రతిపాదిస్తున్న గొడుగు సిద్ధాంతం సైతం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో చర్చకు వచ్చింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఈ సూచనను ప్రశంసించారు.


     కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే గొడుగు వాడకమే అత్యుత్తమ పరిష్కారమని డాక్టర్ సూర్యారావు చెబుతున్నారు. గొడుగు తెరిచి పట్టుకున్నప్పుడు నాలుగు అడుగులు విస్తరించి ఉంటుందని, చుట్టుపక్కల ఉండేవారు వెంటనే దగ్గరికి రావడం సాధ్యం కాదని ఆయన విశ్లేషించారు.పేదవారు సైతం అతి తక్కువ ఖర్చుతో గొడుగును కొనుక్కునే వీలుందని డాక్టర్ చెబుతున్నారు. ప్రస్తుతం సూర్యారావు ప్రతిపాదించిన గొడుగు సిద్ధాంతానికి పలువురు ఆకర్షితులవుతున్నారని ఆయన చెప్పారు.