అయ్యా చిరంజీవిగారూనీకో దండం స్వామీ !


    టాలీవుడ్ నిర్మాతప్రముఖ పారిశ్రామికవేత్త,మెగాస్టార్ చిరంజీవికి  గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.అయ్యా చిరంజీవిగారూ నీకో దండం స్వామీ. ఏం మెగాస్టార్ చిరంజీవిగారు చేయగా, మీరు చేయలేరా అంటూ నా భార్య నిలదీస్తోందంటూ పీవీపీ వాపోయారు.అసలు దేనికి కారణం  ఏంటో తెలుసుకుందాం. దర్శకుడు సందీప్ వంగా. అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తాడు. ఈయన ప్రారంభించిన బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్‌కు ఇపుడు టాలీవుడ్ ఫిదా అయిపోయింది. ఈ ఛాలెంజ్‌కు అతిపెద్ద స్పందన వచ్చింది.


     మహిళలతో ఇంటి పనులు చేయించకండి అంటూ మొదలైన ఈ ఆన్‌లైన్ ఛాలెంజ్‌లో టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేశ్ఎన్టీఆర్ మరికొందరు సినీ స్టార్స్, రాజకీయ నాయకులనుదీనిని ఫాలో అయ్యారు. ఎన్టీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి, తన ఇంటిని శుభ్రం చేశారు. ఆ తర్వాత ఆయన స్వయంగా వంటగదిలోకి వెళ్ళి స్వయంగా ఓ ఉల్లిపాయ పెసరట్టును వేశారు. పైగా అచ్చం ఓ చేయి తిరిగి హోటల్ చెఫ్‌లాగానే ఆయన దోశను వేయడం గమనార్హ. ఆ పెసరట్టు దోసెను తన తల్లికి ఇవ్వగా, ఆమె దాన్ని తన బిడ్డకు తినిపించింది ఆ తర్వాత తాను ఆరగించింది.


    చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, మరో తెరాస మంత్రి కేటీఆర్, తన స్నేహితుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఛాలెంజ్ విసిరారు. పీవీపీ వరప్రసాద్ స్పందించారు చిరంజీవిగారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలం, గచ్చు కడగగలం. కానీ మీరిలా స్టార్ చెఫ్‌లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీరు చేయలేరా అంటుంది సర్ . మీ ప్రేరణ ప్రశంసనీయం ట్వీట్‌తో  చిరంజీవిపై పీవీపీ జోక్ చేశారు.