తెలుగు రాష్ట్రాలు కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది, ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా రాకుండా దృఢనిశ్చయంతో శ్రమిస్తున్నారు. ఈ కరోనాపోరాటంలో లో ఎందరెందరో విధి నిర్వహణలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ప్రభుత్వ డాక్టర్లు, నర్సులు, పోలీస్, జర్నలిస్టులు, ఏపీ రాష్ట్రంలో వాలంటరీలు, ఆశా వర్కర్లు, అనుక్షణం విధి నిర్వహణలో ముందు పోతున్నారు. కరోనా విషయంలో ముఖ్యంగా డాక్టర్లు, పోలీసులు, నర్సుల, పాత్ర ముఖ్యమైనది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో పోలీస్ స్టేషన్లో అనుకోని సంఘటన జరిగింది పోలీసులు ఒకపక్క కరోనా వైరస్, ఇంకొక పక్క లాక్‌డౌన్ ఈ విషయాలలో పోలీసులు ఊపిరి సలపని కార్యక్రమాలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
బందోబస్తు కోసం వెళ్ళటం, డ్యూటీ చేసిన చోటే తినటం, దొరికితే అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకోవడం, ఈ పరిస్థితులలో వారు చేస్తున్న సేవలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. సొంతిల్లు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఇళ్లల్లో శుభమైనా, అశుభమైనా, వెళ్ళలేని పరిస్థితి ఏదైనా అనుకోకుండా ఒక సంఘటన జరిగితే కూడా కడసారి చూపులకు కూడా పోలేకపోతున్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోని ఒక సంఘటన జరిగింది, అడ్మిన్ ఎస్సైగా పనిచేస్తున్న బచ్చు శ్రీనివాస్ సోదరుడు రంజిత్ క్యాన్సర్తో చనిపోయారు.
ఈ విషయం తెలిసి ఎస్సై శ్రీనివాస్ తీవ్ర దుఃఖానికి లోనయ్యారు, నగరంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా డ్యూటీలో ఉండాల్సిన ఉన్న పరిస్థితి ఉండటంతో ఆయన సొంత సోదరుడి అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు.డ్యూటీకి ఓటేసిన ఆయన స్టేషన్ కే పరిమితమై తన సోదరుడు అంత్యక్రియలను వీడియో కాల్ లో చూశారు, తన తమ్ముడికి తుది వీడ్కోలు పలుకుతూ శ్రీనివాస్ కన్నీరు మున్నీరుగా విలపించారు. అక్కడున్న వారు ఇది చూసి వారి మనసు తీవ్రంగా కలిచివేసింది. శ్రీనివాస్ అంకితభావానికి సహ ఉద్యోగులతో పాటు నగర పోలీస్ పౌరులు సెల్యూట్ చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కి రెండు తెలుగు రాష్ట్రాల తరఫున మనం కూడా సెల్యూట్ చేద్దాము.