సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ప్రముఖ నటుడు బ్రహ్మానందం తనవంతు సాయం చేశారు. సినీ కార్మికుల కోసం అగ్ర కథానాయకుడు చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి రూ.3 లక్షలు విరాళంగా ప్రకటించారు.ఇప్పటికే చిరంజీవి,ప్రభాస్,వీరితోపాటు అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు అందించి, తమ మంచి మనసు చాటుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి విరాళంప్రకటించిన ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 లక్షలు అందించారు. శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కు అందజేశారు.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం సంఘం సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కును అందించారు.