ప్రపంచ దేశాలు కరోనా, కరోనా, అంటూ భయం తో వణికిపోతున్న తరుణంలో ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడాలేదు అని ప్రపంచ దేశాలు అందరినీ ఆశ్చర్యపరిచింది. వివాదాలకు,సంచనాలకు, మారుపేరైన ఉత్తర కొరియాదేశ సుప్రీం లీడర్, కిమ్ జోంగ్ ఉన్ (36) తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందంటూ మీడియా పేర్కొంది.ప్రపంచ దేశాలు కరోనా కట్టడికి ప్రణాళికలు రచిస్తున్న వేళ కిమ్ మాత్రం క్షిపణి ప్రయోగాలతో గడిపారు. తన రూటేసపరేటు అని మరోసారి నిరూపించుకున్నారు.అయితే ఏప్రిల్ రెండో వారము తర్వాత . అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడాజాడలేని ఈ వివాదాస్పద నేత.తాత జయంతి ఉత్సవాలకు కూడా కిమ్ రాకపోవడంతో,ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు గుప్పుమన్నాయి.
అంతర్జాతీయ మీడియా సంస్థలు కిమ్ ఆరోగ్యం విషమించిందంటూ కథనాలు వెలువరించాయి. దాయాది దేశం దక్షిణ కొరియాకు చెందిన డైలీ ఎన్‌కే అనే వెబ్‌సైట్ గుండె కండరాల నొప్పితో కిమ్ ఆస్పత్రిలో చేరారని సోమవారం వెల్లడించింది కిమ్ అనారోగ్యానికి గురయ్యారని పేర్కొంది. ఉత్తర కొరియా మీడియా సంస్థ కిమ్ ఆరోగ్యం గురించి ఎటువంటి కథనాలు ప్రచురించకపోవడం గమనార్హం.. ప్రతీ విషయంలో దూకుడుగా ఉండే కిమ్ గురించి ఇంత చర్చ జరుగుతున్నా అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో విదేశీ మీడియా చెబుతున్నట్లు నిజంగానే కిమ్ బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యారా అనే అనుమానాలకు బలం చేకూరుతోంది.
అగ్రరాజ్యం అమెరికా నిఘా వర్గాలు సైతం ఈ వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నామని,మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం కిమ్ గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. 2018, 2019లో రెండుసార్లు భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన, సంపూర్ణ అణ్వాయుధ నిరాయుధీకరణే లక్ష్యంగా జరిగిన భేటీలో కుదుర్చుకున్న ఒప్పందంపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు.ఏకఛత్రాధిపత్యానికి సవాలు విసిరిన ఈ యువ నేత త్వరగా కోలుకోవాలంటూ పలువురు ఆకాంక్షిస్తున్నారు.