కరెన్సీ నోట్లపై కరోనావైరస్ కలకలం!


     ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కరోనావైరస్ ఏపీని వెంటాడుతోంది.ఏదో ఒక మూలాన పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.తూర్పుగోదావరి జిల్లాలో కరెన్సీ నోట్లపై కరోనావైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇక డబ్బులపై వైరస్ ఉండటం తద్వారా మనుషులకు సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది.చేతులు పలానా చోట పెట్టాలంటేనే జంకుతున్నారు జనం.ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి  ఏదైనా కొనుగోలు చేసేసమయంలో క్యాష్‌కు బదులుగా ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం సూచించింది. వీలైనంత వరకు చెల్లింపులన్నీ డిజిటల్ పేమెంట్స్ ద్వారానే చేయాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.


     కరెన్సీ నోట్ల నుంచి గుంటూరు, తూర్పుగోదావరి, జిల్లాల్లో రెండు కేసుల సోకిందన్న విషయాన్ని అధికారులు నిర్థారించారు. ఎప్పటికప్పుడు చేతులుశుభ్రంగా చేసుకోవాలంటూ ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు ఎక్కువగా చేతులపైనే కరోనావైరస్ ఉంటుందని అందుకే తరచూ సబ్బుతో చేతులు బాగా కడుక్కోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.తలుపులు, లిఫ్ట్ డోర్లు, స్విచ్‌లు, కంప్యూటర్‌లు ఇవన్నీ కరోనా వైరస్ వాటి మీదకు పాకే అవకాశం ఉంది.


    ఈ మూడు జిల్లాల్లోకరెన్సీ నోట్ల ద్వారా వ్యాపించిందని అధికారులు గుర్తించారు. వస్తువులు కొనుగోలు అమ్మకం చేసే సమయంలో కరెన్సీ నోట్లు మార్పిడి సందర్భంగా వీరికి వైరస్ సోకిందని చెబుతున్నారు.మూడు జిల్లాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కేబుల్ టీవీ ఆపరేటర్లు, వాటర్ క్యాన్లు, సప్లయ్ చేసేవారు, పాల వ్యాపారులు,కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలు, మెడికల్,  నగదు తీసుకుని వస్తువులను సప్లయ్ చేస్తారు.గుంటూరులో ఓ ఆర్ఎంపీ డాక్టరుకు కరోనా పాజిటివ్ సోకింది. అయితే ఆయన ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుని వైద్యం చేశారు. ఆ కరెన్సీ నోట్ల నుంచే ఆ ఆర్ఎంపీ డాక్టర్‌కు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. మరో రెండు వారాల పాటు కరెన్సీ నోట్లను తీసుకోవద్దంటూ  పోలీస్ శాఖ ఆదేశాలు జారీచేసింది.డిజిటల్ పద్దతిలోనే జరగాలని పేర్కొంది.