టిడిపి నాయకుడు ఏవిఆర్ జోకరా .. టిడిపి నేత రాజా నాయుడు!!!


     టిడిపి నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి, ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి, వైసీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,మంత్రి అని అనిల్, దొడ్డపనేని రాజా నాయుడు, ముంగమూరుశ్రీహరి, ఈ ఇద్దరి కాంట్రాక్టర్ల  దగ్గర డబ్బులు వసూలుచేసి బిల్లులు చెల్లించారని ఆరోపణలు చేశాడు.ఇద్దరూ కలిసి నగరపాలక సంస్థ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేసే దాంట్లో లంచాలు ముట్ట చెప్పారని ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.


     ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టిన మాజీ కార్పొరేటర్ దొడ్డపనేని రాజా నాయుడు  ఆగ్రహం వ్యక్తం చేశాడు.  కార్యకర్తల బాగు కోసంపాటు పడని ఆనం వెంకటరమణారెడ్డి ఈవిధంగా మాట్లాడటం ఏమిటని. ఇకనైనా అబద్ధాలు మాని నిజాలు చెప్పాలని తనతో పాటు మరొక కాంట్రాక్టర్ శ్రీహరి లంచాలు ఇచ్చామని చెప్పటం దారుణమని అన్నారు.


     తనకు రావాల్సిన బాకీ బిల్లులో 16 లక్షలు మంజూరు అయ్యాయని, అవి కూడా 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు మాత్రమేనని రాజా నాయుడు స్పష్టం చేశారు. అసలు వెంకటరమణారెడ్డి ఆరోపించినట్లు ఎస్సీ సబ్ప్లాన్ నిధుల నుంచి కోట్ల రూపాయల నిధులు తమకు ఎలాంటి బిల్లులు మంజూరు కాలేదు అని, ఆ బిల్లుల కోసం ఎమ్మెల్యేని మంత్రిని సంప్రదించలేదని ఇకనయినా ఆనం వెంకటరమణారెడ్డి  నిరాధార  ఆరోపణలు  మాని  కార్యకర్తల బాగు కోసం పనిచేయాలని హితవు చెప్పారు.