వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన కరోనా సోషల్ మీడియా వింగ్ !


      ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా ఆంధ్రప్రదేశ్లో కూడా కల్లోలం సృష్టిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దీన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం ఒక పద్ధతిలో పోరాటం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రంలో corona ఎక్కువ ఉన్న ప్రాంతాలలో రెడ్ జోన్లుగా విభజించి వాలంటీర్లను, ఆశావర్కర్, లను కూడా రంగంలోకి దించి పోరాడుతున్నారు. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, ఉద్యోగులు, జర్నలిస్టులు,  కరోనా కోసం  నిరంతరం పోరాటం చేస్తున్నారు. ప్రధానమం త్రీ  మంత్రి సైతం రాష్ట్రానికి అండగా ఉన్నారు. ఈ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంది.


    కోవిడ్‌–19 నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలపై సమగ్ర సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకునేందుకు ఉద్దేశించిన వాట్సప్, పేస్‌బుక్‌, మెసెంజర్,‌ చాట్‌ బోట్‌లను క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.హాజరైన సీఎస్‌ నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్, ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత,  ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి.