ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఎ బ్యాంక్ స్కామ్ పాల్పడ్డారంటూ కుప్పం పోలీసులకు ఫిర్యాదు అందింది. దానిని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును వైసీపీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు నమోదు జరిగింది. కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ స్కామ్ లోచంద్రబాబు నాయుడు పిఎ హస్తం ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం హయాంలో 1.92 కోట్లు మేర బ్యాంకులో స్కాన్ జరిగినట్లు కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ పీవీ ఉపేంద్ర కుమార్ తెలిపారు. గతనెల మార్చిలో ఆడిట్ జరిగిందని ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఆయన చెప్పారు. గత మార్చి 9 నగలు వివరాలకు సంబంధించి జ్యువెలరీ అప్రైజల్ జరగగా 46.5 లక్షలు విలువ చేసే 30 బంగారు ప్యాకెట్లు అదృశ్యమైనట్లు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక ఈ 30 బంగారం ప్యాకెట్లపై వడ్డీ రూ.38.44 లక్షలుగా ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే లాకర్ ఇన్చార్జిగా ఉన్న మేనేజర్ వీఎస్వీ నవీన్ బాబును ప్రశ్నించగా, ఇది తన బాధ్యత అని మార్చి 15లోగా కనపడకుండా పోయిన బంగారం సంబంధించిన మొత్తం డబ్బు వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పాడు.ఇప్పటివరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు ఫిర్యాదులో పేర్కొన్నారు.2015లో మార్చి 17వ తేదీ ఇంకోసారి ఇన్స్పెక్షన్ జరిగింది ఆ సమయంలో బ్యాంకుల్లో నగదు 74.81లక్షలు ఉండాల్సి ఉండగా, అది 27.97 లక్షలు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం 46. 83 లక్షల మేర డబ్బులు పక్కదారి పడుతున్నట్లు గుర్తించారు. ఇక దీని పై ఆరా తీయగా బ్యాంకు మేనేజర్ వీఎస్వీ నవీన్ బాబు, క్యాషియర్ కమల్ కుమార్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
మరో 20.25 లక్షలకు సంబంధించి పిఎస్వి నవీన్ బాబును ప్రశ్నించగా 2015 లో శ్రీనివాసులు అనే వ్యక్తి ఈ మొత్తం డబ్బులు తీసుకున్నారని చెప్పారు. ఈ విధమైన ఎంక్వైరీ లో తీగలాగితే డొంక కదిలింది, 2015లో బాబు పిఎ మనోహర్ రికమండేషన్ పై శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానం కు చెందిన 16 బాండ్లను పెట్టి డబ్బులు తీసుకెళ్లాడని, నవీన్ బాబు కుండబద్దలు కొట్టాడు. ఇక ఈ బ్యాంకులో చాలా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇదంతా టిడిపి హయాంలో జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై లోతైన విచారణ చేసి బ్యాంకులోలూటీ చేసిన డబ్బును కట్టించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.