ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ (కొరవ )


    రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరచడానికి, నిల్వచేయడానికి సరిపడా గోదాములు లేవు.మార్కెట్లు నడవకపోవడంతో ధాన్యం, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, అరటి, బొప్పాయి, కూరగాయలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.కాని స్థానికంగా వీటిని ఎంతవరకు వినియోగించగలం.ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయకుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి నిల్వచేయడానికి తగిన స్టోరేజీ సదుపాయంలేక, ఎగుమతులు లేక ఆక్వా రంగంకూడా తీవ్రంగా దెబ్బతింటోందిఇక రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం విషయానికొస్తే.. . 1,03,986 యూనిట్లకుగానూ 7,250 మాత్రమే నడుస్తున్నాయి. పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది, రోడ్డు, రైల్వే రవాణాలు నిలిచిపోవడంకూడా సంక్షోభం పెరగడానికి కారణమయ్యింది.



     పరిశ్రమలు నడవనప్పుడు, వారు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలం. రాష్ట్రానికి ఆదాయం కూడా రాని పరిస్థితి.సహాయ కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత పరిస్థితి తలెత్తింది.లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు.కోవిడ్‌ని–19 నివారణకు ప్రధాని మంత్రిగా మీరు తీసుకున్న విశాలపరమైన, గట్టి చర్యలను నేను బలంగా సమర్థిస్తున్నాను. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ చక్రం ముందుకు కదలాలన్నది నా అభిప్రాయం.ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా, కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగా నైనా నడవాలన్నది నా అభిప్రాయం.


     1918లో వచ్చిన ఫ్లూ కూడా భారతదేశ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. రెండేళ్లకుపైగా అది దేశంపై ప్రభావం చూపింది. మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటే, దీర్ఘకాలంలో మనం పోరాటంచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న వివరాలను, సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్ని దాన్ని విశ్లేషించి కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతున్నాను. 676 మండలాలు మా రాష్ట్రంలో ఉన్నాయి,676 మండలాల్లో 81 మండలాలు రెడ్‌జోన్, ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి595 మండలాలు గ్రీన్‌జోన్లో ఉన్నాయి, ప్రస్తుతానికి కరోనా ప్రభావం వీటిపై లేదు. రెడ్‌జోన్లకే లాక్‌డౌన్‌ పరిమితం చేయాలన్నది నా అభిప్రాయం. జనం గుమిగూడకుండా మాల్స్, సినిమాహాళ్లు, ప్రార్థనామందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలన్నది నా అభిప్రాయం.ఇవికాకుండా మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించాలన్నది నా అభిప్రాయం.ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడంలో ఒక్కటిగా ఉండాలి, ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలిమీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రధానిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకుసాగుతాం.