బాబు మనవడితో ఆడుకో వయ్యా!


    ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ ఎవరంటే ఎవరైనా చెప్పే పేరు విజయ సాయి రెడ్డి. వైయస్సార్ సిపి పార్టీ లో విజయ సాయి రెడ్డి విలువ ఏంటో అందరికీ తెలుసు, కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ అంటిపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో, సుఖాల్లో, ఉన్న నాయకుడు. జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలోనైనా విజయసాయిరెడ్డి సలహా సంప్రదింపులు చేస్తూ ముందుకు పోతున్నాడు. ఇకపోతే 40 సంవత్సరాల రాజకీయ నేత నేను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్లో దిశా నిర్దేశం చేయవలసిన చంద్రబాబు, హైదరాబాద్ లో కూర్చున్న సంగతి తెలిసిందే. కూర్చున్నాడు కూర్చోకుండా  రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ సమయంలో కూడా రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే.


    ఇటువంటి పరిస్థితుల్లో విజయ సాయి రెడ్డి చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశాడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత ఏం పని చేసినా నిజాయితీ ఉండదని, మన కర్మ కాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా గాని ఉండి ఉంటే కరో నామీద యుద్ధం  ప్రకటించడమే కాక వేలెత్తి చూపి ప్రాణనష్టం లేకుండా చేశానని, దేశమంతా డప్పు కొట్టుకొనే తిరిగేవాడిని ధ్వజ మెత్తారు. పాజిటివ్ రోగులనుదాచాల్సిన అవసరం లేదని  దాని వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని,  మనవడితో ఆడుకోకుండా చిటికెలెందుకుఅన్నారు అని ట్వీట్‌ చేశారు.


    ఎక్కడా ఇటువంటి వింతలు, రాజకీయం, లేదు. ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయం, హైదరాబాద్ లోనే ఉన్నావు పోలీస్ పాసు తీసుకుని  తెలంగాణలో కూడా నీ పార్టీ ఉన్నది కదా, పేద ప్రజలకు ఏదైనా సాయం చేయొచ్చు. ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీల నేతలు పేదలను ఆదుకునేందుకు నిత్యావసరాల పంపిణీ చేసి ఆహారాన్ని అందిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. హైదరాబాదులో ఆశ్రయం  ఉన్నందుకు అయినా కొంత బాధ్యత తీసుకో అని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.