కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు, ఇండియా, భారత్, ఏపీ ,నెల్లూరు జిల్లా, ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. దీని దెబ్బకు నెల రోజుల నుంచి భారతదేశం అంతా లాక్ డౌన్ కొనసాగుతుంది. లాక్ డౌన్ లోకొంతమంది కూలి చేసుకునే జీవనం సాగించే ప్రజలు నానా అవస్థలు పడుతుంటే అనేక మంది దాతలు స్పందిస్తూ వాళ్ళ ఆకలి తీరుస్తునారు.కొరోనా వైరసును ఎదురుకోవాలంటే పౌసిక ఆహారం అవసరం.
అదేవిధంగా నెల్లూరు ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం యాదవ్ వీధిలో, గ్రామ వాలంటీర్లు, కొప్పోలు దుర్గ, శ్రీ సాయి, దొడ్ల సుకన్య, ఫోర్ట్ మీడియా మేనేజర్ బొనిగి శీనయ్య, సొంత నిధులతో కోడిగుడ్లు, శానిటేషన్, పంపిణీ కార్యక్రమాన్ని వైకాపా నాయకులు, రాగాల వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, ప్రజలకు పంపిణీ చేశారు.ఈ సేవా కార్యక్రమాలకు పలువురు ప్రజలు వాలంటీర్ల సేవలను అభినందించారు. ముత్తుకూరు వాలంటీర్లను, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ ను అభినందిస్తూ, సొంత నిధులతో వాళ్లు పంపిణీ చేయడం సంతోషమని అన్నారు.
వాళ్లు సొంత నిధులతో ఇంత మంచి పనులు చేయటం ఆనందంగా ఉందని, అదేవిధంగా మంచి పనులు చేస్తున్న గ్రామ వాలంటీర్ లను తెలుగు పాఠకుల తరపున, స్ప్రెడ్ న్యూస్, పత్రిక తరఫున sn టీవీ తరపున అభినందిస్తున్నాము భవిష్యత్తులో ఇంకా ఎంతో ఎత్తు ఎదిగి మంచి పనులు చేయాలని చేయాలని ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాం.