నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డి.ఈ.ఓ.సీ నుంచి బుధవారం రాత్రి కలెక్టర్ శ్రీ యం.వి.శేషగిరి బాబు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగించిన నేపథ్యంలో, నూతన మార్గదర్శకాలు విడుదలయ్యాయని వాటిని అమలు చేయడంతో పాటు.., రెడ్ జోన్, హాట్ స్పాట్, ప్రాంతాల్లో లాక్ డౌన్ ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆర్డీఓకు తెలిపారు. మే 3 వరకూ అన్ని విమాన సర్వీసులు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీనసులను రద్దు చేశారని, ఏప్రిల్ 20 నుంచి గ్రీన్ జోన్ ప్రాంతాల్లోని వ్యవసాయ, పారిశ్రామిక రంగానికి సంబంధించి నూతన మార్గదర్శకాలు విడుదలయ్యాయన్నారు.
ఏప్రిల్ 20 నుంచి గ్రీన్ జోన్ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలపై నూతన మార్గదర్శకాలు అమలు చేయాలన్నారు. గ్రీన్ జోన్ లో కరోనా కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.వైద్య సేవలకు తప్ప మిగిలిన ఎలాంటి సర్వీసులకు మండలాల సరిహద్దులు కూడా ఎవ్వరూ దాటకూడదన్నారు. అంత్యక్రియలు కార్యక్రమాల్లో 20 మందికి మించి అనుమతి ఇవ్వరాదన్నారు. సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఈత కొలనులు, విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు మూసివేత యథావిధిగా కొనాసాగుతుందన్నారు.
మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై లాక్ డౌన్ నిబంధనలు అమలవుతాయన్నారు. వైద్య సేవలు, నిత్యావసర వస్తువుల సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఉపాధి హామీ పనులకు అనుమతి ఉందన్నారు. వ్యవసాయ పనులకు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కూడా సోషల్ డిస్టెన్స్, పాటిస్తూ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలకు కలెక్టర్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే క్రిమినల్ సెక్షన్స్ కింద కేసులు, జరిమానా విధించాలన్నారు. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులుి ఉండవని.., డోర్ టూ డోర్ నిత్యావసరాల పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో కోవిడ్-19 విస్తరించకుండా లాక్ డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ శ్రీ డా. వి.వినోద్ కుమార్, మున్సిపల్ కమీషనర్ పి.వి.వి.ఎస్.మూర్తి, కావలి, వెంకటగిరి, గూడూరు, నాయుడు పేట, నెల్లూరు ఆర్డీఓలు, అధికారులు పాల్గొన్నారు.