ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్ మందు లేక అల్లాడుతుంటే, భయంతో జనాలు బిక్కుబిక్కు మంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అది ఒక ఎత్తు అయితే ఈ వైరస్ను గుర్తించే టెస్ట్ బాగా లేట్ అయి కరోనా వైరస్ సోకిందని కనుక్కోలేక ఈ వైరస్ బారినపడి అనేకమంది ప్రపంచ దేశాలలో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా 5 సెకన్లలో అనుమానం ఉన్న ఎక్స్-రే ఉపయోగించి ఉపయోగించి వైరస్ వ్యాధిని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ-రూర్కీ ప్రొఫెసర్ రూపొందించినట్లు వెల్లడించారు.
ప్రపంచమంతాకరోనామొహమ్మారితో బాధ పడుతున్న వేల ఐఐటి-రూర్కీ ప్రొఫెసర్ ఈ కీలక ప్రకటన చేయటం శుభ పరిమాణం. ఇదే గనుక నిజమైతే కొంతలో కొంత వరకు వైరస్ వ్యాప్తిని అరికట్టే వీలుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వైద్యులు ఒక వ్యక్తి ఎక్స్రే ద్వారా రోగికి న్యుమోనియా లక్షణాలు ఉన్నాయా అని చూడడమే కాకుండా కరోనా నాకు సంబంధించినదా లేదా ఇతర బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అనేది గుర్తించవచ్చు అన్నారు.
దీని కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి 40 రోజులు పట్టిందని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్ వివరించారు. కరోనా, న్యూమోనియాకు, 60 వేల మంది రోగులు ఎక్స్-రే స్కాన్‌లను పరిశీలన చేసిన తర్వాత మొదట ఒక కృత్రిమ మేధస్సు-ఆధారిత డేటాబేస్ అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. అలాగే అమెరికాకు చెందిన ఎన్ఐహెచ్ క్లినికల్ సెంటర్ ఛాతీఎక్స్-రే డేటాబేస్ ను కూడా విశ్లేషించానని చెప్పారు. ఈ సాఫ్ట్‌వేర్ పరీక్ష ఖర్చులను తగ్గించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ నిపుణులు గురయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందన్నారు అయితే జైన్ వాదనకు వైద్య సంస్థ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి ధృవీకరణ రాలేదు.