కరుణా దెబ్బకు అతలాకుతలమవుతోంది అగ్రరాజ్యాలే కంగారుపడుతుంటే, కొంతలో కొంత భారత దేశమే నరేంద్ర మోడీ నాయకత్వం లో లో కరోనా వైరస్ను దాని మరణాలను చాలా తక్కువగా ఎదుర్కొంటుంది. మనకి మన భావిభారత దేశ నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాలు రాజకీయం మాని కరోనా నియంత్రణకు,పేదవాడి ఆకలి తీర్చడానికి అహర్నిశలు కష్టపడుతున్నాయి. బయట రాష్ట్రాలలో ప్రతి పక్షాలు సైతం రాజకీయాలు మాని ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కష్టకాలంలో నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వవలసిన ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే కరోనా బాధితుల సంఖ్య లేదు, పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడులో, కరోనా వైరస్ సంఖ్య అత్యధిక శాతం నమోదవుతున్నాయి. మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్ సంఖ్య ఎక్కువే. ఆంధ్రప్రదేశ్ లో పేదవాడి ఆకలి ఆకలి తీర్చడానికి ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు సొంత డబ్బులతో కష్టపడుతున్నారు. దీన్ని కూడా ప్రతిపక్షం ఓర్వ లేక పోతుంది, దీని వలన కరోనా వ్యాపిస్తున్నదని ప్రచారం చేస్తున్నారు. మోడీ పిలుపు కూడా అదే కరోనా నియంత్రణతో పాటు పేదవాడి ఆకలి తీర్చమని చెప్పారు.
అదేవిధంగా మన రాష్ట్ర నాయకత్వం బాగుందనే చెప్పాలి, భారతదేశంలోనే కరోనా టెస్టుల్లో నెంబర్ వన్ గా నిలిచింది. పేదవాడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు మించిన సహాయం చేస్తుంది. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలలో కరోనా టెస్టులను ఒకసారి పరిశీలిద్దాం. మన రాష్ట్రంలో నిన్నటి వరకు జరిగిన టెస్ట్ లు 61 వేల 666, నిన్నటిదాకా పాజిటివ్ వచ్చిన కేసులు 1016, పాజిటివ్ శాతం 1.65, పర్ సెంట్ శాతం. తెలంగాణలో ఒక్క సారి పరిశీలిద్దాం, తెలంగాణలో ఇప్పటివరకు చేసిన టెస్ట్ లు 13200, పాజిటివ్ కేసులు 983 పాజిటివ్ 7.4 పర్ సెంట్ శాతం .తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్లో ఐదు రెట్లు ఎక్కువ టెస్టులు చేశారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కంటే ఆరు రెట్లు కేసులు ఎక్కువ. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ రాక్షస క్రీడఅపి, రాజకీయాలు మాని అందరూ ప్రజా సేవకు అంకితం అవ్వండి.