ఏపీ రాజకీయాల్లో షర్మిళ జోక్యం!!!


     షర్మిళ  కనిపించడంలేదని చర్చించుకునే వాళ్లకు,ట్విట్టర్లో  సమాధానం చెప్పారు. సాల కాలం తర్వాత ఏపీ రాజకీయాల్లోమెరిపించారు.ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి, అన్న, సంక్షేమ పథకాల అమలు చేయటంలోదివంగత రాజశేఖర రెడ్డిని మించిపోయారని జగన్ ను పొగడ్తలతో ముంచెత్తింది.ఏపీ కరోనా కష్టాలలో ఉంది, కష్టకాలంలో కూడా జగన్ తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి షర్మిళ ప్రశంసలు కురిపించింది. జగన్మోహన్ రెడ్డిని షర్మిళ ఎందుకు ఆకాశానికెత్తారు. విద్యాదీవెన పథకంపై షర్మిళ ప్రశంసలు, విద్యార్ధుల జీవితాల్లో అన్న వెలుగులు నింపారు అంటూ షర్మిళ ప్రశంసలు.



     జగన్ తన సుధీర్గ పాద యాత్రలోతన తండ్రి దివంగత రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమంలో ఒక అడుగు ముందుకేస్తే, పేదవాడికి మేలు చేయడానికి తాను రెండు అడుగులు ముందుకేస్తానని, అనేక సార్లు చెప్పారు. ఆ వాగ్దానాల అమలు దిశగా అడుగులు వేశాడు. అన్న మాటిచ్చిన ప్రకారం ప్రతి పేదవాడికి మేలు చేయడంలో తండ్రిని మించిన తనయుడిగా నిలిచారని, విద్యాదీవెన చరిత్రలో నిలిచిపోతుందంటూ ట్విట్టర్లో మెచ్చుకున్నారు షర్మిళ.వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆ పథకాల ప్రసంగాలను కూడా ఆమె సోషల్ మీడియాకు విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలేజీలకు నిధులు నేరుగా పంపించే వారు.ఏ ఇబ్బంది తలెత్తినా కాలేజీలు చూసుకునేవి. లేని విద్యార్ధులను ఉన్నట్టుగా చూపించి నిధులు వృధా చేసే అవకాశం ఉన్నందున నేరుగా విద్యార్థులకే అందిస్తున్నామని జగన్ ప్రభుత్వం చెప్పుకొస్తోంది.



     షర్మిళ ట్వీట్ కు అభినందనలు తెలుపుతున్న వైసిపి శ్రేణులు. అందరికి మేలు చేసే విధంగా జగన్ అన్న అడుగు ముందుకు వేస్తారవని షర్మిళ పేర్కొంటోంది. షర్మిళ చేసిన ట్వీట్ పట్ల వైసిపి శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఏపిలో జగన్మోహన్ రెడ్డికి ఎంత ఫాలోయింగ్ ఉందో ఇంచుమించు షర్మిళకు కూడా అదే ఫాలోయింగ్ ఉన్నట్టు సమాచారం.ఇటువంటి పథకాలు అమలైతే విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపి ,భవిషత్ కాలమ్ లో వారి కుటుంబం లో కూడా సుఖ సంతోషాలు ఏర్పడతాయి.పెద్దగా రాజకీయాల్లో కనిపించని షర్మిళ తాజాగా ట్వీట్ చేయడాన్నిస్వాగతిస్తున్న వైసిపి  శ్రేణులు.