హ్యపీ బర్త్‌డే బన్ని!


    అల్లు అర్జున్‌ మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది సమయంలోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో,వైవిధ్యమైన సినిమా కథలు సినిమా ఇండస్ట్రీ లోనే అగ్ర హీరోల జాబితాలో కి వెళ్ళిపోయిన హీరో. సూపర్ డూపర్ డాన్సులతో యూత్ ఐకాన్గా ఎదిగిన హీరో. ఈ జన్మ ఉన్నంతవరకు మెగాస్టార్ చిరంజీవి అభిమాని అని తనకు ఉన్న అభిమానాన్ని చాటుకోవడమే గాక, పెద్దల పట్ల గౌరవం ఉందని నిరూపించిన హీరో. ఆపద వస్తే ఆదుకోవడానికి ముందుంటాడు, గుర్తింపు కోసం ఆరాట పడడు,  విలువలతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తున్న అల్లు అర్జున్. సినిమా హీరోగా రారాజుగా వెలిగిపోతు అశేష అభిమానులను సొంతం చేసుకుని తనదైన పందాలు లో దూసుకుపోతున్న సినిమా హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు ఈనాడు. అభిమానులకు పండగ దినం కరోనా మూలంగా పుట్టినరోజు గ్రాండ్ గా  జరుపక  పోయినప్పటికీ, ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు .



     సోషల్ మీడియాలో సైతం మెగా హీరోలు, సినిమా ప్రముఖులు ,అభిమానులు, భారీ ఎత్తున   జన్మ దిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  బన్నీలో ని కసి, కృషి,  నాకు చాలా ఇష్టం హ్యాపీ బర్త్ డే బన్నీ నువ్వు బాగుండాలని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చిన్నప్పటి ఫోటో పోస్ట్ చేయగా అది  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హ్యాపీ బర్త్ డే బన్నీ ఎప్పుడూ నా కోసం ఆలోచిస్తూ ఉంటారు నువ్వు చేసే ప్రతి పని నాకు ప్రేరణ ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను అని శిరీష శిరీష ఇది ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ సార్ పుష్ప ఫస్ట్ లుక్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను రష్మిక మందన.



    యూత్ ఐకాన్ కష్టపడే తత్వం కలిగిన అల్లు అర్జున్ కు కు జన్మదిన శుభాకాంక్షలు మీరు అన్ని భారీ హిట్ సాధించాలని కోరుకుంటున్నాను  నాకు హీరో ఫ్రెండు అయినందుకు ధన్యవాదాలు ఐ లవ్ యు సార్ హరీష్ శంకర్.సోషల్ మీడియా కి సుకుమార్ దూరం కాబట్టి ఆయన తరపున కూడా   నేనే విషెస్ తెలుపుతున్నాను ఇలాగే మాకు వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నాను సంగీత దర్శకుడు హరీష్. తన బర్త్ డే విషెస్ తెలిపిన తనపై ప్రేమ కురిపించిన ప్రతి ఒక్కరికి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపాడు. రాబోయే సినిమాలో నటిస్తున్న బన్నీ పుష్ప సినిమా మా అనేక రికార్డులు కొల్లగొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.