ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం శ్రీ వైయస్.జగన్


    అమరావతి: అమరావతి: కరోనా వైరస్‌ నివారణా చర్యలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్.పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌.జగన్, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, హోంమంత్రి మేకతోటి  సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు.


జగన్;- రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాం: సీఎం. అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నాం.రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్లకుపైగా ఉన్న  కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నాం.కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి,  వారికి వైద్యం అందిస్తున్నాం. ఏపీలో 2,61,216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40వేల మంది ఆశ వర్కర్లు, 20,200 మంది ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి దాదాపు 3వేలమంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. అలాగే కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ వ్యూహం కొనసాగుతోంది, లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడానికి, ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉద్ధృతంగా పరీక్షలు నిర్వహించడానికి, 141 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించాం.


       ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతున్నాం. క్రిటికల్‌ కేర్‌ కోసం నాలుగు అత్యాధునిక ఆస్పత్రులను ఏర్పాటుచేసుకున్నాం. 13 జిల్లాల్లోని ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకున్నాం.జిల్లాల్లో వీటికి అదనంగా మరో 78 ఆస్పత్రులను ఏర్పాటుచేసుకుంటున్నాం. సమర్థవంతంగా క్వారంటైన్‌ చేయడానికి ప్రతి జిల్లాలో కోవిడ్‌ కేర్‌సెంటర్లను ఏర్పాటుచేసుకున్నాం, ఇందులో 26వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి. సామాన్యులపై, రాష్ట్రంపై లాక్‌డౌన్‌ ప్రభావానికి సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను: సీఎం మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే ప్రధాన భూమిక.జీఎస్‌డీపీలో 35శాతం, ఉపాథికల్పనలో 62శాతం వాటా వ్యవసాయానిదే.లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయింది.


                                                                                                                         (  కొరవ నెక్స్ట్ న్యూస్ లో)