కరోనా వైరస్ లాక్ డౌన్ విధించిన తర్వాత క మన రాజకీయ నేతల్లో వచ్చిన మార్పుని మనం గమనిస్తున్నాం, రాజకీయాలకతీతంగా ఇప్పటికే ప్రధాన మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సహా పలువురు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో, మాత్రమే రాజకీయం నడుస్తుంది. ఇదే కోవలో ఇటీవల ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు ఫోన్ కాల్ చేశారు ప్రధాని మోడీ నివాసానికి. దీన్ని ఊహించని ప్రధాని ఏం జరిగిందో తెలుసుకుందామని ప్రయత్నించిగా, లైన్ లోకి వచ్చిన నవీన్ పట్నాయక్. ఈ టైంలో ఫోను చేస్తున్నందుకు క్షమించండి మేము ఆర్డర్ చేసిన కరోనా కిట్‌లు ముంబై నాసిక్ మార్గంలో చిక్కుకుపోయాయు అవి మాకు చేరే అవకాశం ప్రస్తుతానికి లేదు. మాకు మీరే దిక్కు, అవి త్వరగా చేరేలా వెంటనే అభ్యర్థించారు.
మోడీ దేశవ్యాప్తంగా వైరస్ పై బిజీగా ఉన్నా ప్రధాని మోడీ. నవీన్ కాల్ కు స్పందిస్తూ, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని వాకబు చేశారు. సీఎం అసహనంగా నేను బాగానే ఉన్నాను ,ఈ సమయంలో మీకు ఫోన్ చేయడానికి కారణం ముంబై నుంచి కరోనా కిట్లను త్వరగా మా రాష్ట్రానికి పంపమని కోరేందుకే. మీరు నిద్ర లేచే సమయానికి అవి మీముందుంటాయి, దీంతో సీఎం నవీన్ మహానందముతో ఉబ్బితబ్బిబయ్యారు.ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హామీ ఇచ్చిన మేరకు మోడీ నుంచి కిట్లు వచ్చాయి.
ముంబై నాసిక్ మార్గంలో చిక్కుకున్నది కావు, కార్గో విమానంలో ఢిల్లీ నుంచి భువనేశ్వర్ ఎయిర్ పోర్టు, ఈ కరోనా వైరస్ కారణంగా ఎయిర్ పోర్ట్ మూసి ఉంది. కానీ ప్రధాని కార్యాలయం ఆదేశాలతో ఢిల్లీ నుంచి కరోనా కిట్లు పంపుతున్నట్లు ప్రధాని కార్యాలయం ఇచ్చిన సమాచారంతో, భువనేశ్వర్ ఎయిర్ పోర్టును అర్ధరాత్రి అత్యవసరంగా తెరిచారు.నెలరోజులుగా హాయిగా రెస్ట్ తీసుకున్న స్టాప్ ఈ హడావుడి ఏమిటని అనుకున్నారు. నవీన్ పట్నాయక్ ప్రధాని మోడీ కి ఫోన్ చేసిన సమయంరాత్రి 12గంటల15నిముషాలు , కరోనా కిట్లతో కార్గో విమానం భువనేశ్వర్ ఎయిర్ పోర్టులోరాత్రి 3:15 కి ల్యాండ్ అయింది, దటీజ్ మోడీ.