మీకు రాయలసీమ పౌరుషం లేదా, ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుండి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తి కుడి ప్రధాన కాలువలోకి విడుదల చేయడంతో పాటు. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ నీటితో రాయలసీమ ప్రాంతానికి అత్యధిక నీటిని విడుదల చేసి, రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు తాగునీరు అందివ్వాలని అలాగే గాలేరు-నగరి ఎస్సార్సీ కాల్వలకు కూడా 30వేల క్యూసెక్కుల సామర్ధ్యాన్ని పెంచాలని నిర్ణయించింది.
జీవో కూడా విడుదల చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కయ్యానికి కాలుదువ్వుతూఉంటే, అక్కడ ప్రతి పక్షాలు సైతం మద్దతు పలుకుతుంటే, ఇక్కడ ప్రతిపక్షం సైలెంట్ అయిపోయింది. దీన్ని గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203 పై మీ స్టాండ్ ఏమిటని అసలు మీరు రాయలసీమ బిడ్డే నా అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
జిఓ ఇచ్చిన వారం రోజులైనా స్పందించరా మీకు రాయలసీమ పౌరుషం లేదా,లేనిదానికి గంటల గంటల మాట్లాడే మీరు దీనికి స్పందించరా అని విమర్శించిన విజయసాయిరెడ్డి. అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీరు ఈ విషయం ఫై మాట్లాడరా అని విజయసాయిరెడ్డి ఘాటుగా ప్రతిపక్ష నేతపై విమర్శలు చేశారు.రాయలసీమ వాసి అయిన మీరు మాట్లాడర లేక మాట్లాడేందుకు మనసు రాలేదాఅంటూ విమర్శలు గుప్పించారు.