మీ ఇంట్లో బిడ్డే ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్నాడు.
విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు పరిహారం విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్.
క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి గ్యాస్ ప్రభావానికి లోనైన గ్రామాల ప్రజల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున నగదు జమ చేసిన ముఖ్యమంత్రి.ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా ఆదుకుంటాననివిశాఖ గ్యాస్ లీక్ బాధితులకు సీఎం శ్రీ వైయస్.జగన్ భరోసా.ఆరు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి రూ10 వేల సాయం,దాదాపు 20 వేల మంది ఖాతాల్లో నగదు జమ.గ్యాస్ దుర్ఘటనకు బాధ్యులెవరైనా వదిలిపెట్టబోం,ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం.ఈ కంపెనీకు అనుమతులన్నీ టీడీపీ హయాంలోనే.
విశాఖలో ఈ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం, అధికార యంత్రాంగం చాలా వేగంగా స్పందించిందని చెప్పారు.‘తెల్లవారుజామున 4.30 గంటలకల్లా అధికారులంతా రోడ్ల మీదకు వచ్చారు. రెండు గంటల్లో ప్రజలను ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందు కోసం కలెక్టర్, కమిషనర్‌తో సహా, అధికారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.‘మీ కోసం గ్రామాల్లో మంచి క్లినిక్‌లు ఏర్పాటు చేసి, వైద్యులను అందుబాటులో ఉంచుతాం.మీకు ప్రత్యేకంగా హెల్తు కార్డులు అందజేస్తాం. దాని ద్వారా మీరు మెరుగైన వైద్యం పొందవచ్చు.
మేక సుశీల, దుర్ఘటనలో భర్తను కోల్పోయిన మహిళ.
‘ఆ దుర్ఘటనలో నా భర్త చనిపోయాడు. అపోలో ఆస్పత్రిలో మూడు రోజులు చికిత్స పొందాను. అక్కడ చాలా బాగా చూసుకున్నారు. నేను తిరిగి ఆ ఇంట్లో ఉండలేను. కాబట్టి నా మనవడికి ఉద్యోగం ఇస్తే అతనితో పాటు ఉంటాను. నా మనవడు ఎంటెక్ చేశాడు. అందువల్ల నా మనవడికి ఏదైనా ఉద్యోగం ఇస్తే, నేను ఆయనతోనే ఉంటాను.
సీఎం:- దుర్ఘటనలో మరణించిన 12 కుటుంబాల వారికి ఏదో ఒక విధంగా ఉద్యోగం ఇద్దామని చెప్పారు. కనీసం గ్రామ సచివాలయాల్లో అయినా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని, అవసరమైతే నిబంధనలు మారుద్దామని కలెక్టర్‌తో చెప్పారు.
పరమేశ్వరి, ఎస్సీ బీసీ కాలనీ
‘ఘటన జరిగిన వెంటనే మాకు ఏమీ అర్ధం కాలేదు. అర గంట పాటు ఏం జరిగిందో కూడా తెలియదు. అందరం దగ్గర్లోని మేఘాద్రిగడ్డ డ్యామ్ వద్దకు పోయాం. కానీ అక్కడికి పోయాక వాంతులు అయ్యాయి. స్పృహ కోల్పోయాం. తర్వాత మమ్మల్ని ఆస్పత్రుల్లో చేర్చారు. అక్కణ్నుంచి ఒక కాలేజీలో శిబిరం ఏర్పాటు చేసి చాలా బాగా చూసుకున్నారు.మాకు ఎంతో భరోసా ఇచ్చారు. మళ్లీ మీరే సీఎంగా ఉండాలి.
గంగరాజు, పద్మనాభనగర్
‘ఆ రాత్రి గ్యాస్ లీక్ కాగానే, పోలీసులు వచ్చారు. సైరన్ మోగించారు. మమ్మల్ని అప్రమత్తం చేశారు. అధికారులు కూడా వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆస్పత్రుల నుంచి శిబిరానికి తరలించి మంచి ఆహారం పెట్టారు. చిన్న పిల్లలకు కోడిగుడ్లు కూడా పెట్టారు. మంత్రులు, విజయసాయిరెడ్డి గారు వచ్చి మా యోగక్షేమాలు విచారించారు. మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు.
సీఎం:-విశాఖ కలెక్టర్, అధికారులు, మంత్రులు,ప్రజా ప్రతినిధులకు,కృతజ్ఞతలు. గ్రామంలో పడుకుంటానని మంత్రి కన్నబాబు స్వయంగా ముందుకు వచ్చారు. ఇది ఎందరికో స్ఫూర్తి దాయకం. నా మంత్రివర్గంలో ఇంత మంచి వారున్నారని నిజంగా సంతోషపడ్డాను.
మంత్రి కె.కన్నబాబు:- ‘మీరు చరిత్రలో నిల్చిపోతారు. మీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాము. మానవీయకోణంలోనూ మీకెవ్వరూ సాటిరారు.ఎవ్వరూ ఊహించని విధంగా పరిహారం ప్రకటించారు.
కంప్యూటర్‌లో బటన్ నొక్కిన సీఎం శ్రీ వైయస్ జగన్, 19,893 వేల మంది ఖాతాల్లో రూ.10 వేల చొప్పున నగదు జమ చేశారు.