( స్ప్రెడ్ న్యూస్ ) :- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు లోని సెట్టిగుంట రోడ్డు బేతేలు ప్రార్థన మందిరం లో, శుక్రవారం నాడు పేద పాస్టర్లకు మందిరం లో శుక్రవారం పాస్టర్స్ వెల్ఫేర్అసోసియేషన్ సహాయం. ప్రపంచము లో కరోనా విలయ తాండవం. ఏపీ లో గూఢ కరోనా దెబ్బకు జనాలు నానా అవస్థలు పడుతున్నారు .నెల్లూరు లో గూడాకరోనాదెబ్బకు జనాలు విపత్కర పరిస్టుల్లో ఉన్నారు.పేదవారిని ఆదుకోవాలని పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శుక్రవారం నాడు పేద పాస్టర్లకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది.
పై కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కస్టమ్స్ సూపరిండెంట్ ఉషాకిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం అందరి బాధ్యత అని, ఇప్పటి పరిస్థితి దృష్ట్యా కరోనా తగ్గే పరిస్థితి లేదని, ఈ పరిస్థితులలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మానవుని కి సహాయ పడటమే దేవుడు కోరుకుంటాడు అని ఆమె అన్నారు.
అనంతరం నెల్లూరు జిల్లా రచయితల సంఘ అధ్యక్షుడు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా తో తీవ్ర కష్ట నష్టాలకు గురి అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. పాస్టర్లు అందరూ ప్రజల్లో అవగాహన కల్పించి లాక్ డౌన్ నిబంధనలు అమలు అయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా పేద పాస్టర్లకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు.నిత్యావసర వస్తువుల పంపిణీ సహాయం చేసిన అందరిని మా పత్రిక తరుపున అభినందిస్తున్నాము.