వైసీపీ ప్రభుత్వం లెక్కల్ని దాచిపెడుతోందన్న ప్రతిపక్ష టీడీపీ. కేంద్ర బృందం సీఎం జగన్ దాచిపెడుతోన్న వాస్తవాల్ని నిగ్గుతీయడానికేసోమవారం(మే4న) ఏపీలో పర్యటించబోతున్నట్లు ఆ పార్టీ చెప్పింది.టీడీపీ విమర్శల్లో ఇసుమంతైనా నిజం లేదని, కరోనా నివారణకు సంబంధించిన అన్ని విషయాల్లో ఏపీనే టాప్ లో ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు.దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అని, వెంటిలేటర్లు, క్వారంటైన్ సెంటర్లు, ICUబెడ్ల ఏర్పాటులోనే ఏపీనే అగ్రగామిగా నిలిచిందని,అత్యవసర వైద్య బృందాలను ఎక్కడికైనా పంపించే సామర్థ్యాన్ని కూడా సాధించామని, తద్వారా యువ సీఎం జగన్ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా నిలిపారని గుర్తుచేశారు.
సీఎం జగన్ కరోనా నియంత్రణ చర్యల్లోదుమ్మురేపుతున్నారన్న ఎంపీ విజయసాయి,తీవ్రస్థాయిలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన ఎంపీ విజయసాయి రెడ్డి.గెలిచి ఏడాది కూడా పూర్తికాకముందేసీఎం జగన్ తనేంటో నిరూపించుకున్నాడని,ప్రజల కోసం నిరంతరం శ్రమించే జగన్ ముందు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తేలిపోతున్నారని ఎద్దేవా చేశారు.ఎల్లో మీడియా చంద్రబాబు ని ఎంత సమర్థిస్తున్న ప్రయోజనం లేదని ఓడి 11నెలలు గడిచినా ఇంకా సీఎం అనుకుంటున్నారని అన్నారు .
లోకేశ్‌ను పప్పుగా, చంద్రబాబును తుప్పుగా ఉంటారని అన్న విజయసాయి, భౌతిక దూరం పాటించడం అంటే మన రాష్ట్రానికి దూరం కావటంకాదు.హైద్రాబాద్ లోఉన్నతుప్పు, పప్పులకిది చక్కని అవకాశం సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వెసులుబాటు దొరికింది. సాకులు చెప్పే వీలు కూడా లేదు. వ్యాక్సిన్ వచ్చేదాకా ఏపీలో అడుగుపెట్టేది లేదంటే ఇక మీరు శాశ్వతంగా హైదరాబాద్ లోనే ఉండిపోండి.అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇంకా తప్పటడుగుల దశలో ఉన్న టెలిమెడిసిన్ ను ఏపీలో పల్లెబాట పట్టించిన ఘనత సీఎం జగన్ దేనని ఇది సూపర్ హిట్ అయిందనిఅన్నారు .